విశాఖ భూముల కుంభకోణం పై జగన్ కు కన్నా లేఖ, గంటా పై ఒత్తిడి పెంచేందుకేనా?

ఆ మధ్య వచ్చిన ధ్రువ సినిమాలో, ఒక డైలాగ్ ఉంటుంది.వార్తా పత్రికలలో, చానెల్స్ లో వచ్చే ప్రతి వార్త వెనుక ఇంకెక్కడో లింక్ ఉంటుంది అన్నది ఆ డైలాగ్ సారాంశం. ఇప్పుడు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ సంగతి చూస్తే, ఈ లేఖ వెనకాల ఇంకేవో ఉద్దేశాలు ఉన్నాయని కూడా ప్రజల్లో సందేహాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే విశాఖలో జరిగిన భూముల కుంభకోణం పై పెద్ద ఎత్తున రగడ జరిగింది. అదే ప్రాంతానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ కుంభకోణంపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను కూడా ఏర్పాటు చేశారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఇచ్చిన నివేదిక మాత్రం బహిర్గతం కాలేదు. గంటా శ్రీనివాసరావు పార్టీ మారదాం అనుకున్నప్పుడల్లా చంద్రబాబు ఆ నివేదికను చూపించి, ఆ నివేదికను బహిర్గతం చేస్తామని చెబుతూ, గంటా ను భయపెట్టారని అప్పట్లో రూమర్లు వచ్చేవి. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీ లోనే కొనసాగి , ఎన్నికల్లో విజయం కూడా సాధించాడు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాస్తూ ఆ నివేదిక బయటపెట్టాలని కోరడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ కి చెందిన నలుగురు ఎంపీలు మొన్నామధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వారు అలా చేయడానికి కొద్ది నెలల ముందు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి వారి ఆర్థిక నేరాలపై పెద్ద లేఖ రాశారు. రకరకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చి మొత్తానికి వారిని బీజేపీలో చేర్చుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందని, ప్రత్యేకించి గంటా శ్రీనివాసరావుకు మరికొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే బాధ్యత అప్పగించిందని రూమర్లు వచ్చాయి. అయితే గంటా ఆ పుకార్లను ఖండించారు. దీంతో ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి రాసిన లేఖ, గంటా శ్రీనివాసరావుపై ఒత్తిడి పెంచేందుకే అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థనను ఒక్కదాన్ని కూడా తోసిపుచ్చకుండా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుండడంతో, గంటా శ్రీనివాసరావుపై సిట్ నివేదిక పేరిట ఒత్తిడి తెచ్చి బీజేపీ మిషన్ కు తలొగ్గేలా చేయాలని బీజేపీ పెద్దల వ్యూహం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి గంటా శ్రీనివాసరావు బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్నది కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close