వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో తరిమేసినా కంపెనీ రెన్యూపవర్ మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ అంశంపైనే బుధవారం నారాలోకేశ్ ట్వీట్ చేశారు రెన్యూ మొత్తం పునర్వినియోగ రంగంలో పెట్టనున్నట్లు ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నాని లోకేష్ తెలిపారు. రూ. 82,000 కోట్ల కోట్ల పెట్టుబడితో, రెన్యూ సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ నుంచి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వరకు, ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ , మాలిక్యూల్స్ వరకు పెట్టుబడి పెడుతోంది. విశాఖ సమ్మిట్ లో ఈ మేరకు ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
నిజానికి ఈ సంస్థ గత టీడీపీ హయాంలోనే పెట్టుబడులు పెట్టాలని అనుకుంది. ఒప్పందాలు కూడా జరిగాయి. కానీ గ్రౌండింగ్ కాక ముందే జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆ పెట్టుబడిని తరిమేసింది. అప్పటికే ఆ సంస్థ కొంత ఖర్చు పెట్టుకుని పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇది అంతర్జాతీయ సంస్థ కావడంతో.. ఏపీ ఇమేజ్ కు
ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో సారి ఏపీవైపు రాబోమని ఆ సంస్థ పలు మార్లు చెప్పింది.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తామని.. హామీ ఇచ్చారు. జగన్ వచ్చే అవకాశం లేదని .. పెట్టుబడికి కేంద్రం వైపు నుంచి గ్యారంటీ ఇప్పించడంతో ఆ సంస్థ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇలా వెళ్లిపోయిన పరిశ్రమలన్నింటినీ ఎలాగోలా మళ్లీ ఏపీకి తెచ్చేందుకు చంద్రబాబు, నారాలోకేశ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.


