తెలుగు ప్రజల కోసం మహానాడులో టీడీపీ ఆరు శాసనాలను నారా లోకేష్ ప్రతిపాదించారు.అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీ ఇంజినీరింగ్, 5. అన్నదాతకు అండగా 6. కార్యకర్తలే అధినేత. ఆ ఆరింటి కేంద్రంగానే భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని నారా లోకేష్ ప్రకటించారు.
తెలుగుదేశం వల్లే తెలుగువారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉందని లోకేష్ అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో తెలుగువారే ముందుండాలనే అజెండాగా పెట్టుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేయబోతున్నామని మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉందన్నారు. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రానున్నరోజుల్లో మహిళలను మరింత బలోపతం చేసేందుకు స్త్రీ శక్తిద్వారా మనం కృషిచేయబోతున్నామని క్యాడర్ కు తెలిపారు.
పేదరికం లేని సమాజం కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ – 6 హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. వచ్చేనెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని ప్రకటించారు. . ఇప్పుడు పి-4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తీసుకురావడానికి చేయూతనందిస్తున్నామని గుర్తు చేశారు. రైతు లేకపోతే సమాజమే లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇక పార్టీ విషయంలో కార్యకర్తే అధినేతనని లోకేష్ శాసనం ప్రకటించారు. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య స్పూర్తి అన్నారు. కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారన్నారు. కార్యకర్తలకు 5లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ ్న్నాపు, కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోందని ప్రకటించారు.