సంక్రాంతి సీజన్ లో వస్తున్న రెండో సినిమా… `మన శంకర వర ప్రసాద్ గారు`. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలన్నీ వచ్చేశాయి. ట్రైలర్ వదిలారు. `హుక్ స్టెప్` పాట ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేశారు. పాటలకు మంచి స్పందనే వస్తోంది. ట్రైలర్ మాత్రం యావరేజ్ మార్క్ దగ్గర ఆగింది. కాకపోతే.. సినిమాలోని చాలా విషయాలు అలానే అట్టిపెట్టారు. కొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ థియేటర్లో చూడాల్సిందే.
ముఖ్యంగా ఈ సినిమా కోసం భీమ్స్ మరో పాట చేశాడు. చిన్న బిట్ సాంగ్ అది. దాన్ని రిలీజ్ చేయలేదు. అది చాలా కీలకమైన సందర్భంలో వస్తుందని, ఆ పాట వచ్చినప్పుడు థియేటర్ అంతా ఊగిపోతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పాటు కొన్ని మ్యాజిక్ మూమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయని, అవేమీ ట్రైలర్ లో రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. చిరు, వెంకీ సినిమాల పాత పాటలు కొన్ని మెడ్లీ రూపంలో వినిపించనున్నాయని, అవి కూడా సర్ప్రైజ్ చేస్తాయని తెలుస్తోంది. 12ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 11 నుంచి ప్రీమియర్లు మొదలైపోతాయి. చిరు – వెంకీలపై ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అది పండగ రోజుల్లో విడుదల చేసే ఛాన్స్ వుంది.
