లవర్..సిన్సియారిటీ తక్కువ

తెలుగు360.కామ్ రేటింగ్ :2.75/5

అమ్మాయిని అయినా, సినిమాను అయినా సిన్సియర్ గా ప్రేమించాలి. అప్పుడే ఫలితం వుంటుంది. సినిమాను తాగి, తిని, జీర్ణించేసుకుంటే ఆ ప్రొడెక్ట్ నే వేరుగా వుంటుంది. లేదూ, కాస్త కాస్త గా పైపైన రుచి చుస్తే అది వేరుగా వుంటుంది. అందులోనూ యూత్ సినిమాలు కొత్త పోకడలు తొక్కుతున్న రోజులు ఇవి. ఓ ప్రేమ, ఓ విలన్, ఓ క్లయిమాక్స్ అనంటే జనాలు ఒప్పే రోజులు కావు ఇవి. అయినా కూడా అదే లైన్ ను కాస్త యూత్ ఫుల్ గా, మరి కాస్త కలర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేసాడు గతంలో అలా ఎలా అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను గతంలో అందించిన దర్శకుడు అనీష్ కృష్ణ.

సరుకు పాతదయినా ప్రతివారం ప్యాకింగ్ మార్చడం తప్పదు. కస్టమర్లు ఇప్పుడు అంతగా కొత్తదనం కోరుతున్నారు. లవర్ సినిమా కూడా ఇలాంటిదే. సరుకు పెద్దగా కొత్తది కాదు. కానీ ప్యాకింగ్ మాత్రం కాస్త కొత్తగా వుండేలా చూసుకున్నారంతే. దానివల్ల సినిమాకు కాస్త పాజిటివ్ లుక్ వచ్చిన మాట వాస్తవం. తనుకున్న లక్ష్యం కోసం తపన పడిన అమ్మాయి, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎంతకైనా తెగించిన అబ్బాయి. ఇదీ లవర్ సింగిల్ లైన్ పాయింట్.

రాజ్ (రాజ్ తరుణ్) ఓ బైక్ డిజైనర్. చరిత ఆసుపత్రలో పనిచేసే నర్స్. ఆమెతో ప్రేమలో పడతాడు ఇతగాడు. రాజ్ కు అన్నలాంటి జగ్గూ (రాజీవ్ కనకాల) ఓ పెయిడ్ గూండా. ఎక్కడో కోయంబత్తూర్ లో వుండే పేద్ద డాన్ ది రేర్ బ్లడ్ గ్రూప్. అతగాడికి ఓ జబ్బు. అందుకోసం అలాంటి బ్లడ్ గ్రూప్ వున్న వ్యక్తి కావాలి. అలాంటి గ్రప్ వున్న లక్ష్మి అనే పాప, చరిత పని చేసే ఆసుపత్రలో పేషెంట్ గా వుంటుంది. దాంతో ఆమెను క్లినికల్లీ డెడ్ చేయాలని చూస్తారు. అలాంటి టైమ్ లో ఆ పాప మాయం అవుతుంది. అదే టైమ్ లో చరితను అటాక్ చేయాలని చూస్తారు కొందరు. ఇదంతా ఏమిటి? చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన సినిమా అని చెప్పక్కరలేదు. ఈమాత్రం చెబితే చాలు మన ప్రేక్షకులు మిగతా కథ అల్లేసుకోగలరు.

వైవిధ్యమైన కథ లేదా పాయింట్ వుంటే తప్ప, ఓకె అనని నిర్మాత దిల్ రాజు ఈ రొటీన్ సబ్జెక్ట్ ను ఎందుకు ఓకె అన్నారో తెలియదు. అయితే దర్శకుడు అనీష్ కృష్ణ తన తొలిసినిమా అలా ఎలా ను తీసిన తీరు చూసి, దిల్ రాజు నమ్మకం పెట్టుకుని వుండాలి. నిజానికి ఆ నమ్మకాన్ని చాలా వరకు దర్శకుడు నిలబెట్టుకున్నారు. సినిమాను ఎంటర్ టైనీగా తీయడంలో ఎక్కడా తప్పు చేయలేదు. ప్రవీణ్, సత్య తదితరులను వాడుకుని ఫన్ ను ఆద్యంతం వుండేలా చూసుకోవడంలో బాగానే విజయం సాధించాడు. అదే సమయంలో సినిమాను ఆద్యంతం కలర్ ఫుల్ గా వుండేలా చూడడంలో కూడా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఓ మీడియం సినిమాకు సరిపడినంత కాకుండా, మరి కాస్త ఎక్కువే రిచ్ నెస్ ను తీసుకువచ్చారు. అదే సమయంలో సినిమాకు మంచి పాటలు సమకూర్చుకోవడంలో కూడా తక్కువ చేయలేదు.

కానీ వీటన్నింటి విషయంలో జాగ్రత్త పడిన దర్శకుడు సినిమా ఇంటెన్సిటీని నిలబెట్టుకోవడంలో కూడా ఆ కృషి కనబర్చి వుండాల్సింది. అలాంటి సీన్లు అన్నింటిలో తేలిపోయాడు. హీరో, హీరోయిన్ సన్నివేశాలు, హీరో, అతని స్నేహితుల సీన్లు బాగా డీల్ చేయగలిగిన దర్శకుడు విలన్ సీన్లు, క్లయిమాక్స్ విషయాల్లో మరికాస్త సిన్సియారిటీ, సీరియస్ నెస్ చూపించాల్సింది. అక్కడ తేలిపోయాడు. అలాగే రాజీవ్ కనకాల పాత్రను మరి కాస్త బాగా తీర్చి దిద్దాలి. ఏదో మొక్కుబడి వ్యవహారం అన్నట్లు వుంది. క్లయిమాక్స్ లో ఆ పాత్ర ఎలా ముగుస్తుందో తెలిసిన దర్శకుడు మొదటి నుంచీ ఆ పాత్రను కాస్త ఓ మెట్టు పైనే నిలబెట్టి వుండాల్సింది. దర్శకుడు చెప్పాడో లేక, ఈమాత్రం చాలు, ఇంతకన్నా ఎక్కువ ఎందుకు అనుకున్నాడో, రాజీవ్ కనకాల అలా అలా చేసాడు తప్ప, పూర్తి ఇన్ వాల్వ్ మెంట్ కనిపించలేదు. క్లయిమాక్స్ పార్ట్ లొ కొంతవరకు ఓకె.

సినిమాలో వున్న ఇంకో లొపం దర్శకుడు కథలో ఏ విషయాన్ని దాచాలని అనుకోకపోవడం. సినిమా కథ ఏమిటి? ఏ దిశగా వెళ్లబోతోంది? అన్నది ఆది నుంచీ తెలిసిపోతూనే వుంటుంది. అందువల్ల పెద్దగా ఉత్కంఠ ఏమీ వుండదు. ఆరంభంలో ఆసుపత్రి సీన్ల విషయంలో కాస్త గుట్టు చూపించి వుంటే వేరుగా వుండేది. పైగా ఎక్కడో కోయంబత్తూర్ డాన్ కు, ఇక్కడి అనంతపురంలో ఆసుపత్రి వర్గాలకు మధ్య లింక్ ఎలా సెట్ అయిందన్నది కాస్త క్లారిటీ ఇచ్చి వుంటే బాగుండేది.

సినిమా ప్రథమార్థం స్మూత్ గా సాగిపోతోంది. పెద్దగా ప్లస్సూ అనిపించదు. అలా అని మైనస్సూ అనిపించదు. నాలుగు సీన్లు, ఆరు జోకులు, రెండు పాటలు అన్నట్లు వెళ్లిపోతుంది. సినిమా ద్వితీయార్థంలో ప్రవేశించాక కేరళలో హీరో, హీరోయిన్ల మధ్య కాస్త మాంచి కెమస్ట్రీ వర్కవుట్ అయ్యేలా ఒకటి రెండు సీన్లు రాసుకుని వుండాల్సింది. కానీ అటు దృష్టి పెట్టలేదు. ఇలా ఎంగేజ్ మెంట్ సెట్ చేసి, సినిమాను అలా క్లయిమాక్స్ కు తెచ్చేసారు.

సినిమాకు ప్లస్ ఏమిటంటే నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, లోకేషన్లు, సంగీతం. ఇవన్నీ కలిసి సినిమాను కలర్ ఫుల్ గా, చూడబుల్ గా మార్చాయి. రాజ్ తరుణ్ తన స్టయిల్ లోనే వెళ్లాడు. కొత్తగా ట్రయ్ చేసింది ఏమైనా వుంటే ఫైట్లు మాత్రమే. కొత్త అమ్మాయి రిద్దీ ఆ పాత్రకు అలా సరిపోయింది. కాస్త చిలిపితనం కూడా సెకండాఫ్ లో చూపించి వుంటే యూత్ కు మరికాస్త కనెక్ట్ అయ్యేది. కానీ దర్శకుడు ఆ లైన్ లో ఆలోచించినట్లు లేదు. రాజీవ్ కనకాలకు చాలా కాలం తరువాత కాస్త లెంగ్తీ రోల్ దొరికింది. బాగానే చేసాడు. కానీ అతను ఇంకా బాగా చేయగలడు. అది వాస్తవం. మిగిలిన వారు ఓకె.

సినిమాకు టెక్నికల్ టీమ్ మాంచి బలం అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ (సమీర్ రెడ్డి) చాలా బాగుంది. లొకేషన్లు ఎంచుకోవడం బాగుంది. జెబి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. వివిధ మ్యూజిక్ డైరక్టర్లు చేసిన పాటలు బాగున్నాయి. ఈ టెక్నికల్ సపోర్ట్ వల్లనే సినిమా చూడబుల్ గా తయారైంది. దానికి తగినట్లు నిర్మాత ఖర్చు కూడా పెట్టారు.

ఫైనల్ వెర్టిక్ట్

వారం వారం ఓ సినిమా చూడాలనుకునేవారి కాలక్షేపానికి లోటు ఇవ్వని సినిమా. డిఫరెంట్ గా వుండాలి. సమ్ థింగ్ న్యూ వుండాలి అనుకునేవారికి కాస్త డిస్సపాయింట్ మెంట్ గా వుంటుంది.

ఫినిషింగ్ టచ్

ఏదో..అలా..అలా

తెలుగు360.కామ్ రేటింగ్ :2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close