చిరుని పిల‌వ‌లేదు.. పిలిచినా బాల‌య్య రాలేదు

మా’ అధ్య‌క్షుడిగా ఈరోజు మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేసేశారు. ఆయ‌న‌తో పాటు విష్ణు ప్యాన‌ల్ నుంచి గెలిచిన స‌భ్యులంతా ప్ర‌మాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల్ని మంచు విష్ణు స్వ‌యంగా ఆహ్వానించాడు. నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటికి వెళ్లి.. ఆహ్వాన ప‌త్రం అందించాడు. ప్ర‌కాష్ రాజ్‌నీ పిలిచాడు. చిరంజీవికి కూడా ఆహ్వానం అందుతుంద‌ని అంతా ఆశించారు. కానీ.. చిరుని ఈ కార్య‌క్ర‌మానికి పిల‌వ‌లేదు. దాంతో ఆయ‌న క‌నిపించ‌లేదు. పిలిచినా.. బాల‌య్య రాలేదు. ప్ర‌కాష్‌రాజ్ తో పాటు, ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లో గెలిచిన‌వాళ్లెవ‌రూ ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌చ‌లేదు.

ఈ కార్యక్ర‌మానికి తెలంగాణ మాత్రం శ్రీ‌నివాస‌యాద‌వ్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఆయ‌న ఈ సంద‌ర్భంగా చిత్ర‌సీమ‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తారేమో అని అంతా అనుకున్నారు. `మా` బిల్డింగ్ స్థ‌లం కోసం ఆయ‌న నుంచి ఏదైనా మాట వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అదీ లేదు. పైపెచ్చు ”ఇండ్ర‌స్ట్రీలో ఉన్న హీరోలంతా ముందుకొచ్చి, త‌లా కొంత వేసుకుంటే స‌మ‌స్య స‌మ‌సిపోతుంది” అనే టైపులో మాట్లాడారు. అంటే.. `మా` బిల్డింగ్ కోసం ప్ర‌భుత్వం ఏమీ ఇవ్వ‌ద‌న్న‌మాట‌. హీరోలే చేసుకోవాల‌న్న‌మాట‌. ప్ర‌స్తుతానికి ఇంతే. మంచు విష్ణు.. చొర‌వ‌, ఉత్సాహం చూపి, ప్ర‌భుత్వాన్ని, పెద్ద‌ల్నీ క‌దిలించ‌గ‌లిగితే త‌ప్ప – `మా` బిల్డింగ్ కి అటు నుంచి సాయం అంద‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close