‘సూప‌ర్‌’ కింగ్స్‌: యేడాదిలో ఎంత మార్పు?

ఐపీఎల్ లో అత్యంత బ‌ల‌మైన జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్‌. సూప‌ర్ స్టార్ల జ‌ట్ట‌ది. పైగా ధోనీ లాంటి అత్యుత్త‌మ కెప్టెన్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అందుకే నాలుగు సార్లు ఐపీఎల్ విజేత‌గా ఆవిర్భ‌వించింది. అయితే ఈ సీజ‌న్ చెన్నైకి చాలా క్లిష్ట‌మైన సీజ‌న్ గా అభివ‌ర్ణించారు క్రీడా పండితులు. ఎందుకంటే 2020లో ఆ జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 14 మ్యాచ్‌ల‌కు గానూ కేవ‌లం ఆరింటిలో గెలిచి – ఏడో స్థానంతో స‌రిపెట్టుకుంది. సూప‌ర్ స్టార్లు అన‌ద‌గిన‌వాళ్లెవ‌రూ రాణించ‌లేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే చెన్నై క‌నీసం ప్లే ఆఫ్ చేర‌కుండా – ఇంటికెళ్లిపోవ‌డం అదే ప్ర‌ధ‌మం. పైగా జ‌ట్టులో వ‌య‌సు మ‌ళ్లిన ఆట‌గాళ్ల సంఖ్య ఎక్కువైంది. వాళ్లెవ‌రూ అంచ‌నాల‌కు త‌గిన‌ట్టు రాణించ‌లేదు. ధోనీ సైతం మెరుపులు మెరిపించ‌లేక‌పోయాడు. ఎప్పుడూ లేనిది.. వికెట్ల మ‌ధ్య ప‌రిగెట్ట‌డంలోనూ అల‌స‌త్వం చూపించాడు. దాంతో చెన్నై ప‌ని అయిపోయింద‌ని భావించారంతా. 2021లో భారీ మార్పులు త‌ప్ప‌వ‌ని అనుకున్నారు.

కానీ ధోనీ త‌న జ‌ట్టుపై న‌మ్మ‌కాన్ని ఉంచాడు. మార్చింది ఆట‌గాళ్ల‌ని కాదు. వ్యూహాన్ని. 2020లో చేసిన త‌ప్పులేవీ పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. అనుభ‌వాన్ని, యువ‌ర‌క్తాన్ని స‌మానంగా న‌మ్మాడు. స‌మాన‌మైన అవ‌కాశాలిచ్చాడు. అందుకే 2021 విజేత‌గా చెన్నై ఆవిర్భ‌వించింది. బ్యాట్స్‌మెన్ గా ధోనీ ఈ సీజ‌న్‌లో మెరుపులు మెరిపించ‌లేదు. కానీ కెప్టెన్ గా మాత్రం స‌క్సెస్ అయ్యాడు. బౌల‌ర్ల‌ని మార్చిన విధానం, ఫీల్డింగ్ మోహ‌రించిన ప‌ద్ధ‌తి, మైదానంలో స‌హ‌నం కోల్పోనివ్వ‌కుండా తోటి ఆట‌గాళ్ల‌ని న‌డిపించ‌డం – ఇవన్నీ పాత ధోనీని గుర్తు చేశాయి. ముఖ్యంగా ఢిల్లీతో జ‌రిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చి, త‌న జ‌ట్టుని ఫైన‌ల్ కి చేర్చాడు.

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ద‌క్కించుకున్నాడు గైక్వాడ్‌. రెండో స్థానంలో డూప్లిసీస్ ఉన్నాడు. ఇద్ద‌రూ చెన్నై ఆట‌గాళ్లే. గ‌త సీజ‌న్ లో ప‌వ‌ర్ ప్లేలో పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు చెన్నై. దాంతో.. చిన్న‌పాటి ల‌క్ష్యాల్ని కూడా ఛేదించ‌లేక‌పోయింది. ఈసారి ఆ త‌ప్పు చేయ‌లేదు. గైక్వాడ్, డూప్లెసిస్ జంట‌.. తొలి వికెట్ కి మెరుగైన భాగ‌స్వామ్యాల్ని అందించింది. రైనా రాణించ‌క‌పోయినా ఆ స్థానంలో వ‌చ్చిన ఊత‌ప్ప కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్ అలీని కూడా ధోనీ స‌రిగానే వాడుకున్నాడు. ఇక జ‌డేజా ఈ సీజ‌న్‌లో త‌న ఆల్ రౌండ‌ర్ నైపుణ్యాన్ని మ‌రోసారి చాటుకున్నాడు, గ‌తంతో పోలిస్తే… ఈసారి చెన్నై ఫీల్డింగ్ మ‌రింత ప‌టిష్టంగా మారింది. ఫైన‌ల్ లో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు అందుకున్న క్యాచ్‌లే అందుకు నిద‌ర్శ‌నం. వ‌య‌సైపోయింద‌నుకున్న బ్రావో కూడా…. ఈ ఐపీఎల్ లో త‌న స‌త్తా చాటాడు. 2020లో క‌నిపించింది ఈ జ‌ట్టేనా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా .. 2021 జ‌ట్టుని తీర్చిదిద్దాడు ధోని. అందుకే 4వ సారి ఐపీఎల్ క‌ప్పుని ముద్దాడ‌గ‌లిగాడు. శ‌భాష్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close