పొలం ప‌నుల్లో మ‌హేష్ బాబు

మ‌హేష్ బాబు రైతుగా మారాడు. కాలేజీలో పుస్త‌కాలు ప‌ట్టి.. పాఠాలు నేర్పాల్సిన `రిషి`…. పొలంగ‌ట్ల‌లో నాగ‌లి ప‌ట్టి, విత్త‌నాలు చ‌ల్లుతున్నాడు. ఇదంతా `మ‌హ‌ర్షి` సినిమా కోసం. మహేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రమిది. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే క‌థానాయిక‌. ప్ర‌స్తుతం పొలాచ్చీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మ‌హేష్ రైతుగా మారి, పొలం ప‌నులు చేస్తున్న స‌న్నివేశాల్ని పొలాచ్చీలో కొన‌సాగుతున్నాయి. స్నేహం విలువ తెలియ‌జెప్పే క‌థ ఇది. మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వితీయార్థంలో మ‌హేష్ రైతు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. రైతు స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్ప‌నున్నాడు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, వీవీపీ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close