స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్ అమెరికాలో కాలు పెట్ట‌నున్నాడు. ఈ క్రిస్మ‌స్ అమెరికాలో జ‌రుపుకోవాల‌ని, న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కూడా అక్క‌డే చేసుకోవాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడు. త‌న కుటుంబంతో స‌హా డిసెంబ‌రు 24నే యూ.ఎస్ ఫ్లైట్ ఎక్కేయ‌బోతున్నాడు మ‌హేష్‌. డిసెంబ‌రు 30న మిగిలిన బృందం అమెరికా వెళ్తుంది. అమెరికాలో దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జ‌ర‌బోతోంది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ఎవ‌రు కనిపిస్తార‌న్న‌ది తేలాల్సివుంది. ఉపేంద్ర‌, అర‌వింద్ స్వామి లాంటి పేర్లు మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అత‌నెవ‌ర‌న్న‌ది ఓ వారంలో కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close