సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా – సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా స్పందించాడు. దాంతో సోనూ పేరిట అభిమాన సంఘాలు ఏర్ప‌డ్డాయి. సోనూని వేనోళ్ల పొగ‌డ‌డం ప్రారంభించారు.

క్ర‌మంగా సోనూ ఇమేజ్ మారింది. ఎప్పుడైతే ఓ న‌టుడిపై జ‌నాల‌కు అభిమానం పెర‌గ‌డం ప్రారంభం అవుతుందో, ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాల‌ని చిత్ర‌సీమ ఆరాట‌ప‌డుతుంది. అది స‌హ‌జం. అందుకే… సోనూ కి అవ‌కాశాలు వెల్లువ‌లా రావ‌డం మొద‌లైంది. దాంతో సోనూ కూడా రేటు పెంచేశాడు. ఇప్పుడు రోజుకి 20 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. సోనూని పెట్టుకుంటే… క‌నీసం 15 – 20 రోజుల షూటింగైనా చేయాలి. అంటే.. సినిమాకొచ్చి దాదాపు 4 కోట్ల‌న్న‌మాట‌. అయితే… మిగిలిన ఖ‌ర్చులు అద‌నం. సోనూ డ‌బ్బింగ్ చెప్పుకోడు. అయ్య‌ప్ప శ‌ర్మ‌లాంటి వాడ్ని తీసుకొచ్చి.. డ‌బ్బింగ్ చెప్పించాలి. దానికి మ‌రో 10 ల‌క్ష‌లు అద‌నం. అయినా స‌రే, సోనూనే కావాల‌ని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు వెంట ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఓ బ‌డా హీరో సినిమా కోసం సోనూని సంప్ర‌దిస్తే.. కాల్షీట్లు చూసి, 5 కోట్లు అడిగాడ‌ట‌. నిర్మాతేమో.. 1.25 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయాడ‌ని స‌మాచారం. దాంతో సోనూ ఆ సినిమా చేయ‌న‌ని చెప్పేశాడ‌ట‌. ఇదీ.. సోనూకి టాలీవుడ్ లో ఉన్న డిమాండ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

HOT NEWS

[X] Close
[X] Close