అఫీషియ‌ల్‌: సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్న మ‌హేష్‌

ఈ సంక్రాంతి బ‌రి నుంచి స‌ర్కారు వారి పాట త‌ప్పుకుంది. జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ.. జ‌న‌వ‌రి 7న ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌స్తోంది. ఆ త‌రవాత రాధేశ్యామ్ ఎలాగూ ఉంది. అందుకే ఇప్పుడు స‌ర్కారు వారి పాట వెనుక‌డుగు వేసింది. ఈచిత్రాన్ని మార్చి 31న గానీ, ఏప్రిల్ 1న గానీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సాయింత్రం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాబోతోంది. మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. కీర్తి సురేష్ క‌థానాయిక‌. సంక్రాంతి సీజ‌న్ మ‌హేష్ కి బాగా అచ్చొచ్చింది. అందుకే.. ఈ సంక్రాంతికీ త‌న సినిమా విడుద‌ల చేద్దామ‌నుకున్నాడు. కానీ ఆర్‌.ఆర్‌.ఆర్ వ‌ల్ల ప్లాన్ మారింది. భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుంద‌ని టాక్ వినిపిస్తోంది. కానీ అఫీషియ‌ల్ గా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close