మహేష్ ఇంటర్వ్యూ : సినిమా బాగుంటే ముందుగా ఎక్కడ రిలీజ్ అయినా ఒక్కటే !

Mahesh Babu Interview Brahmotsavam

శ్రీమంతుడు వంటి మెసేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత  తొమ్మిది నెలలు కి సూపర్ స్టార్ మహేష్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’ తో మే 20న మీ ముందుకు వస్తున్నాడు. పి.వి.పి. సినిమా పతాకంపై “సీతమ్మ వాకిట్లో… ” దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న’బ్రహ్మోత్సవం’ విడుదల సందర్భంగా మే 15 సాయంత్రం హీరో మహేష్ బాబుతో  హైదరాబాద్ పార్క్ హయత్ లో తెలుగు360.కామ్ ప్రతినిధి రాంబాబు వర్మ  జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు :

శ్రీ మంతుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇది ఎలా వుండబోతుంది..?
ఈ నెల 20 న మీ ముందుకు వస్తున్న’బ్రహ్మోత్సవం’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేను చెప్పడం ఎందుకు వారం లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. నేను మా టీం అంతా కాన్ఫిడెంట్ గా వున్నాము. మోడరన్ డేస్ లో ఎవరికి వారే తమ కెరీర్ ముఖ్యమని కుటుంబ విలువల్ని మర్చిపోతున్నారు. ఆ విలువల్ని గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. కుటుంబం మధ్య జరిగే కథే ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కలగలిపిన చిత్రం. ఈ సినిమాలో సీన్స్ అన్ని సహజంగా వుంటాయి, ఎక్కడ నాటకీయం గా వుండవు. ఎమోషన్స్ ప్యూర్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. అండర్ పాయింట్ ప్రేమ కథ కూడా ఉంటుంది.

Click here for Mahesh’s Srimanthudu Exclusive Interview with Telugu360

కథ ఎప్పుడు ఓ కె చేసారు?
శ్రీమంతుడు లాంటి ఇన్స్పిరేషనల్ సినిమా తరువాత ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఫ్యామిలీ సినిమా చేయడం నా అద్రుష్టం. ఒకే తరహా చిత్రాలు కాకుండా డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి. శ్రీకాంత్ గారు ‘శ్రీమంతుడు’ సినిమా సమయంలో నాకు బ్రహ్మోత్సవం స్టొరీ చెప్పారు. అప్పుడే సినిమా చేయడానికి ఒకే చెప్పాను.

సీతమ్మ వాకిట్లో…దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో చేస్తున్న రెండవ చిత్రం కదా..?
శ్రీకాంత్ తో ఇదివరకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేశాను. అతనిది సపరేట్ స్టైల్ ఆ సినిమాకు బ్రహ్మోత్సవానికి ఎలాంటి పోలికలు ఉండవు. ఈ రెండు చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అయినా, ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు నేను ఇలాంటి కంటెంట్ వున్నా సినిమా చేయలేదు. ఇది కథగా నాకు ఫ్రెష్ మూవీ.

ఈ చిత్రం లో స్టార్ కాస్ట్ చాల వుంది కదా…? శ్రీ కాంత్ ఎలా డీల్ చేసాడు?
కథ చెప్పినపుడే, టోటల్ కాస్టింగ్ గురించి శ్రీ కాంత్ చెప్పాడు. సుమారు 200 సార్లు అయిన మేమిద్దరము ఈ సినిమా కోసం మీట్ అయివుంటాము. శ్రీమంతుడు వంటి చిత్రం తరువాత ‘బ్రహ్మోత్సవం’ లాంటి కథ నాకు దొరకడం అది నా లక్. ఎందుకంటె కథ గా డిఫరెంట్ కాంట్రాస్ట్ వున్నా చిత్రం ఇది.

Click Here for Interview Photos

శ్రీమంతుడు చిత్రం లో మహేష్ కన్నా ‘బ్రహ్మోత్సవం’ ట్రైలర్ లో పోస్టర్ లో మహేష్ కి చాల వయసు తగ్గినట్లు కనిపిస్తున్నాడు.
అవునండి…శ్రీ కాంత్ నాకు కథ చెప్పినపుడే నా కారెక్టర్ ని డిజైన్ చేసి మరి చెప్పాడు. కథ చెప్పినపుడు కారెక్టర్ నేమ్ చెప్పకుండా ఈ కుర్రాడు ఆ కుర్రాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు చిత్రం లో కథానాయకుడు కుర్రాడిగా కనపడాలి అనే నన్ను కుర్ర హీరో గా యంగ్ గా డిజైన్ చేసాడు.

‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి వరకు మీరు పాదరక్షలకు వంగి దణ్ణం పెట్టడం పోస్టర్ హైలెట్ చేసారు  ఫాన్స్ నుండి మీకు ఎలాంటి వ్యతిరేకత లేదా ?
పెద్దవారికి వంగి నమస్కరించడం భారతీయ సంప్రదాయం, ఈ చిత్రం లో వున్న ముఖ్యమైన పాయింట్ అదే మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన సమయం ఇది. శ్రీ మంతుడు టైటిల్ పెట్టి సైకిల్ పై నన్ను చూపిస్తే ఆ సినిమాకు కూడా ఇలాగే అడిగారు సినిమా లో సైకిల్ పాత్ర ఏమిటో రిలీజ్ తర్వాత అందరికి  తెలిసింది.  శ్రీ కాంత్ రాసుకున్న కథ  ను బట్టి  ఆ పోస్టర్  రిలీజ్ చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత  ఈ విషయం లో ఫాన్స్ ఎక్కడ తప్పు పట్టరు

మీ కేరేర్ లో ఈ చిత్రం ఎంత వరకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారు?
వారం ఆగండి మీరే చెపుతారు…మీరే రాస్తారు…నా ఒక్కడికే కాదు ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది.

సత్య రాజ్, మీ బ్రదర్ నరేష్ తో పనిచేయడం ఎలా వుంది?
సత్య రాజ్ గారి చిత్రాలు నేను చెన్నై లో చదువుకుంటున్న రోజుల నుండి చూస్తున్నాను. గ్రేట్ ఆర్టిస్ట్ అయన, ఆయనతో పని చేయడం హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. ఇక నరేష్ గారితో పని చేయడం నా సినిమా కేరేర్ లో ఫస్ట్ టైం. ఆయనతో ఓ పాట చిత్రీకరణ తో కలిసి చేయడం జరిగింది చాల కంఫర్ట్ ఆర్టిస్ట్ అయన.

అమెరికా లో ఈ చిత్రం ఇండియా లో కంటే ముందుగా స్క్రీనింగ్  జరుగుతాయి కదా..? అక్కడి రిపోర్ట్ ను బట్టి ఇక్కడ ఓపెనింగ్స్ వస్తున్నాయి అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎంత వరకు ఇది నిజం?

సినిమా బాగో లేకపోతే కదా? సినిమా బాగుంటే ఎక్కడ ముందు వేసినా, దానికుండే వసూళ్ళు దానికి వుంటాయి.కాని ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఎవరిని నిరుత్సాహ పెట్టదు. శ్రీ మంతుడుకి అదే చెప్పాను ,ఈ చిత్రానికి మళ్ళి చెపుతున్నాను.

బ్రహ్మోత్సవాలు అనే సరికి తిరుపతి గుర్తుకొస్తుంది, అక్కడ షూటింగ్ చేసారా?
తిరుపతి లో చేయలేదండి…ఈ సినిమా కోసం చాలా అవుట్ డోర్ షూటింగ్స్ చేశాం. హరిద్వార్, వారణాసి,ఉదయ్ పూర్ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్లాం. బ్రహ్మోత్సవాలు జరిగే ఒక ప్రాంతాన్ని తీసుకొని సినిమాను చిత్రీకరించాం. నా చిత్రాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా కి ఇన్ని లోకేషన్స్ లో షూటింగ్ జరగ లేదు. ఇది ఫస్ట్ టైం.

సీతమ్మ వాకిట్లో మిమ్మల్ని ‘చిన్నోడా’…. అని పిలిపించాడు శ్రీ కాంత్ మరి ఇందులో….
సస్పెన్స్…వారం ఆగండి. ఏ రకం గా పిలిపించాడో మీరే చూస్తారు? (అని పక్కనున్న శ్రీ కాంత్ కేసి చూసాడు మహేష్)

పివిపి బ్యానర్ లో మీరు పార్టనర్ గా చేసిన చిత్రం ఇది, పివిపి గారి సహకారం ఎలా వుంది?
అయన కూడా ఇక్కడకు రావాల్సింది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా అక్కడే వున్నారు. మంచి నిర్మాతే కాదు మంచి వ్యక్తి కూడా, ఈ సినిమా కోసం పివిపి గారు అడిగింది కాదనకుండా  ఇచ్చారు. కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.

పివిపి బ్యానర్ లో ‘ఊపిరి’ ద్విభాషా చిత్రంగా నిర్మించారు. సక్సెస్స్ అయ్యారు మీకు ఇంత పెద్ద మార్కెట్ వుంది రెండు భాషలలో నిర్మించ వచ్చు కదా?
నా నెక్స్ట్ ఫిలిం మురుగదాస్ గారితో ఆ విధంగానే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రెండు భాషల్లో ఆ సినిమా విడుదలవుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

తెలుగు360.కాం తరఫున బ్రహ్మోత్సవం ఘన విజయం సాధించాలి అని సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, ఆయన అభిమానులకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము 

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

బీజేపీ పెద్దల నుంచి కోమటిరెడ్డి కోరుతున్న హామీ ఏంటి !?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ...

వైసీపీలో అనుమాన ముసలం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం వైసీపీలో చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమకు సాంకేతికంగా ఉన్న 23 ఓట్ల వరకే టార్గెట్ పెట్టుకోవడంతో ఆ మేరకు క్రాస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close