రివ్యూ : యదార్ధంగా థ్రిల్ చేసే చిత్రం ‘మలుపు’

తెలుగు సినీ చరిత్ర లో టాప్ హీరోలందిరితో ను బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన స్టార్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన తనయుడు ఆది పినిశెట్టి తెలుగు సినిమాతో పరిచయమైనా. తమిళ్ సినీ రంగం లో కోచడయాన్, మిరుగం, ఈరమ్, అరవాన్, తదితర చిత్రాలలో నటించి మంచి నటుడు గా పేరు తెచ్చు కున్నాడు ఆది. ‘గుండెల్లో గోదారి’ ద్వారా తెలుగు ప్రేక్షకులతో కూడా భేష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘మలుపు’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఓ డిఫరెంట్ మూవీ తీయాలనే ఆకాంక్షతో ఆది సోదరుడు సత్యప్రభాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఒక కొడుకు హీరోగా, మరో కొడుకు దర్శకుడిగా రవిరాజా పినిశెట్టి నిర్మించిన ఈ ‘మలుపు’ ఎలా ఉందో చూద్దాం…

కథ:

సగ అలియాస్ సతీష్ గణపతి (ఆది) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఓ బాధ్యతలేని కుర్రాడని సగ తండ్రి ఎప్పుడు తిడుతుంటాడు. సగ తల్లి మాత్రం సగ ఆటకాయితనంగా ఉంటాడేకానీ బాధ్యతకల కుర్రాడని నమ్ముతుంది. తనకు ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఆ యేడాది ఎగ్జామ్స్ ని ఎగొట్టేసి ఓ ఆరు నెలల పాటు లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ నేపధ్యం లో లాస్య (నిక్కి గల్రాని) ప్రేమలో పడతాడు సగ. వీరి ప్రేమకు హెల్ప్ చేస్తారు సగ ఫ్రెండ్స్. సరిగ్గా ఆ సమయంలో సగ అక్కకి పెళ్లి కుదురుతుంది. సగ తల్లిదండ్రులు ఊరికి వెళుతూ సగకి పెళ్లి పనులు పురమాయించి జాగ్రత్తగా చేయాలని చెబుతారు.అదే రోజు డిసెంబర్ 31 కావడంతో సగ, అతని ఫ్రెండ్స్ పార్టీ లో పాల్గొని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయిన తర్వాత లాస్యను తీసుకుని సగ వెళ్లిపోతాడు.తాగిన మత్తులో సగ ఫ్రెండ్ రెస్టారెంట్ లో ఉన్న ప్రియ (రిచా పల్లడ్) ని టీజ్ చేస్తాడు. దాంతో ప్రియ ఫ్రెండ్ సూర్య వీరితో గొడవపడతాడు. ఆ గొడవ పెద్దదవ్వడం సూర్యను సగ ఫ్రెండ్స్ కొట్టడం జరుగుతుంది. తన ఫ్రెండ్ తాగి కంట్రోల్ లేకుండా ఉన్నాడని మరో ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న సగ రెస్టారెంట్ కి వస్తాడు. సగ గొడవ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపు పోలీసులు వచ్చి ఫ్రెండ్స్ ని అక్కడ్నుంచి వెళ్లిపొమ్మంటారు పోలీసులు. సూర్యను అరెస్ట్ చేస్తారు. ప్రియ ముంబయ్ డాన్ ముదలయార్ కూతురని తెలుస్తుంది. ముదలయార్ చేతిలో చిక్కకున్న తన ఫ్రెండ్స్ ని సగ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ.ఈ ప్రాబ్లమ్ నుంచి సగ సేఫ్ ఎలా బయటపడతాడు .. అన్నదే మిగతా కథ…

నటీనటుల పర్ఫార్మెన్స్:

స్నేహం కోసం ప్రాణాలివ్వడానికి సైతం వెనకాడని స్నేహితుడిగా ఇలా సగ పాత్రలో ఉన్న పలు వేరియేషన్స్ ను అద్భుతంగా ఆవిష్కరించాడు ఆది. మంచి ఫిజిక్, చక్కని యాక్టింగ్ తో ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయే డు. రియల్ గా సగ అనే కుర్రాడు కనిపిస్తున్నాడా..! అని ప్రేక్షకులు ఫీలయ్యే రేంజ్ లో ఆది ఆ పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి దగ్గర చివాట్లు తినేటప్పుడు అమాయకంగా, తల్లి దగ్గర గారాల కొడుకుగా, ప్రేయసి దగ్గర మంచి ప్రియుడిగా, ఆది ఫస్ట్ మార్కులు కొట్టేసాడు. నిక్కీ గల్రాని క్యూట్ గా ఉంది. హెవీ బైక్ నడిపి, తాను డ్యాషింగ్ అని నిరూపించుకుంది. ముదలియార్ పాత్రలో మిథున్ చక్రవర్తి నటన సుపర్బ్. హరీశ్ ఉత్తమన్ తన టాలెంట్ ను బాగా చూపించాడు. నాజర్, ప్రగతి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలా గ్యాప్ తర్వాత రిచా పల్లోడ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. పాత్ర పరిధి మేరకు నటించింది.

సాంకేతిక వర్గం:

యదార్ధ సంఘటన ఆదారంగా దర్శకుడు సత్య ప్రభాస్ ద్వారా రాసుకున్న కథ ఇది. స్ర్కీన్ల ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలం. స్టార్టింగ్ టు ఎండింగ్ ఉత్కంఠగా సాగే స్ర్కీన్ ప్లేతో తీశాడు. తొలి సినిమా అయినా ఎన్నో సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా సత్య ప్రభాస్ కి పేరు రావడం ఖాయం. ప్రేక్షకులు కుర్చీల్లోంచి కదలకుండా చూసేట్లు తీశాడు. ముఖ్యంగా ఇటు ఎ సెంటర్ అటు బి, సి అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఈ సినిమా ఉంది. ట్విస్ట్ లు ఆసక్తిగా ఉంటాయి. అంతే ఆసక్తిగా ఆ ట్విస్ట్ లను రివీల్ చేసిన విధానం కూడా చాల బాగుంది. అలా కొన్ని సినిమాలకే కుదురుతుంది. సినిమా పరిశ్రమకు దొరికిన మరో టాలెంటెడ్ దర్శకుడు సత్యప్రభాస్. ప్రసన్-ప్రవీణ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ‘వాడు వీడు ఎవడైనా…’ పాట చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి ఓ బలం. షణ్ముగ సుందరం ఫొటోగ్రఫీ బాగుంది. ఒక కొడుకుని దర్శకునిగా పరిచయ్ చేస్తూ, మరో కొడుకు హీరోగా రవిరాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. మేకింగ్ వేల్యూస్ బాగున్నాయి. కథ ప్రకారం అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయం.

విశ్లేషణ:

హాలీవుడ్ తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య సౌత్ లో కూడా ఎక్కువయ్యాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ లో బాగుంది. యదార్ధ సంఘటన ను డైరెక్టర్ సత్య ప్రభాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడంలో ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అయినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం సక్సెస్ అయ్యాడు. వన్ మాన్ ఆర్మీలా సినిమా మొత్తాన్ని నడిపించిన ఆది పినిశెట్టి పెర్ఫార్మన్స్ మరియు సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ స్టొరీ ఈ సినిమాకి మేజర్ హైలెట్. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదే అనే ఫీల్ కలుగు తుంది. కొన్ని తమిళ్ సినిమాలలో తెలుగు ‘గుండెల్లో గోదారి’లోనే తనలో మంచి నటుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న ఆది మరోసారి పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ కాగలననే విషయాన్ని నిరూపించుకున్నారు. మొత్తం మీద తండ్రి రవిరాజా పినిశెట్టి గర్వించదగ్గ కొడుకులనే చెప్పాలి .ఈ చిత్రాన్ని అన్ని వర్గాలవారూ చూడొచ్చు. గంటా యాభై తొమ్మిది నిమిషాలు సాగే ఈ చిత్రంలో ఒక్క సీన్ కూడా వేస్ట్ అనిపించదు. చివరాఖరుగా చెప్పాలంటే… రొటీన్ సినిమాలతో విసుగెత్తి, ఏదైనా కొత్తగా చెబితే చూద్దాం అనుకునేవారికి, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ థ్రిల్ చేసే ‘మలుపు’ బాగా నచ్చుతుంది. థియేటర్ కి వెళ్లి చూడచ్చు

తెలుగు360.కామ్ రేటింగ్‌: 2.75/5

బ్యానర్ : ఆదర్శ్ చిత్రాలయ ప్రై.లిమిటెడ్
నటీనటులు : ఆది పినిశెట్టి, మిథున్ చక్రవర్తి, నిక్కి గల్రాని, రిచా పల్లోడ్, పశుపతి, ప్రగతి, నాజర్, కిట్టి, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం : ప్రసన్, ప్రవీణ్, శ్యామ్
సినిమాటోగ్రఫీ : షణ్ముగ సుందరం
ఎడిటింగ్ : సాబు జోసెఫ్
నిర్మాత : రవిరాజా పినిశెట్టి
రచన, దర్శకత్వం : సత్య ప్రభాస్ పినిశెట్టి
విడుదల తేది : 19.02.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close