వైకాపాలోకి డొక్కా మాణిక్యవర ప్రసాద్ జంప్

మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ వార్త ఆ పార్టీకి చెందిన మీడియాలోనే వచ్చింది కనుక అది నిజమనే భావించవచ్చును. ఆయన తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావుకి సన్నిహితుడు. గనుక ఆయన ఈ వార్తపై తక్షణమే స్పందించారు. డొక్కా వైకాపాలో వెళతారని తాను భావించడం లేదని రాయపాటి అన్నారు. అంటే డొక్కా వైకాపాలో చేరడం ఆయనకి ఇష్టం లేదని చెపుతున్నట్లే భావించవచ్చును. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ నేతలకు అధికార తెదేపాలోకి వచ్చే అవకాశం లేనప్పుడు,  పార్టీ మారాలనుకొంటున్నకాంగ్రెస్ నేతల ముందు ఉన్నవి రెండే రెండు అవకాశాలు. వైకాపా లేదా బీజేపీలో చేరడం. తెదేపా, బీజేపీలలో చేరే అవకాశం లేనివారు సహజంగానే వైకాపావైపు మళ్ళవలసి వస్తుంది. బహుశః బొత్స, డొక్కా వంటి నేతలు అందుకే వైకాపాలో చేరుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. బొత్స సత్యనారాయణ తరువాత ఆ వైకాపాలో చేరబోతున్న మొట్ట మొదటి కాంగ్రెస్ నేత ఆయనే. కనుక ఆయనని వైకాపాలో చేరడానికి బొత్స సత్యనారాయణ ప్రోత్సాహించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అదే నిజమయితే త్వరలోనే మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపాలోకి ప్రవేశిస్తారేమో! అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత అద్వానంగా మారవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close