మావోయిస్టుల నిర్మూలనలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. చత్తీస్ఘడ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ ఆపరేషన్స్ చీఫ్ నంబాల కేశవరావును చనిపోయారు. దళాలు ఆయనను కాల్చి చంపాయి. ఈ ఎన్ కౌంటర్ లో దాదాపుగా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో నంబాల కేశవరావు. ఈయన తలపై కేంద్రం గతంలో కోటిన్నర అవార్డును ప్రకటించింది. ఈ స్థాయిలో తలకు వెల కట్టిన అతి కొద్ది మంది మావోయిస్టుల్లో కేశవరావు ఒకరు.
నంబాల కేశవరావు అసలు పేరు బససరాజు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బసవరాజు ఉన్నత విద్యావంతుడు. వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో అప్పట్లోనే ఇంజినీరింగ్ చేశాడు. అక్కడ అయిన పరిచయాలతో ఆయన నక్సలైట్ గా మారాడు. కిందిస్థాయి నుంచి ఎదిగాడు. నక్సల్స్ ఉన్నత నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ఎన్నో మిలటరీ ఆపరేషన్లకు నాయకత్వం వహించాడు.
కేశవరావు దండకారణ్య ప్రాంతంలోని మావోయిస్ట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. సాయుధ తిరుగుబాట్లు, గెరిల్లా దాడులు, ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులన్నీ కేశవరావు కనుసన్నల్లోనే నడిచేవి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో అనేక హింసాత్మక ఘటనలకు కేశవరావు కూడా ఓ కారణం. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో , స్థానిక గిరిజన సమాజాలను సమీకరించడంలో కీలకంగా ఉన్నాడు. కేశవరావు నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ , ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు బలంగా మారారు. సమాంతర ప్రభుత్వాలను నడిపారు. చివరికి ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.