పెళ్లి చూపులు సినిమాతో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోల జాబితాలో చేరాడు విజయ్ దేవరకొండ. అతని కోసం కొత్త కథలు సిద్దం అవుతున్నాయి.అయితే విజయ్‌లోని టాలెంట్‌ని ముందే కనిపెట్టిన మారుతి ఓ తెలివైన పని చేశాడు. విజయ్‌తో మూడు సినిమాలకు ఎగ్రిమెంట్ రాయించుకొన్నాడు. అవును.. ఇప్పుడు విజయ్ కెరీర్ మారుతి చేతుల్లోకి వెళ్లింది. విజయ్ చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. అవి పూర్తయిన వెంటనే మారుతితో సినిమాలు చేయాల్సివుంది. మారుతి నిర్మాణంలో మూడు సినిమాల్లో నటిస్తానని విజయ్ మాటిచ్చాడని సమాచారం. అందుకు గానూ.. రూ.3 కోట్ల రెమ్యునరేషన్ కూడా మాట్లాడుకొన్నారని తెలుస్తోంది.
విజయ్ తో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లంతా మారుతి దగ్గరకు వెళ్లాల్సిందే. ఎందుకంటే మారుతి దగ్గర విజయ్ లాక్ అయిపోయాడు. తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలనుకొంటోంది. మారుతి మూడు సినిమాల లిస్టులో యూవీ క్రియేషన్స్ సినిమా కూడా ఉందట. విజయ్‌తో ఓ సినిమా చేసుకోమని యూవీ క్రియేషన్స్‌తో చెప్పేశాడట. దాంతో యూవీ – విజయ్ దేవర కొండ సినిమా దాదాపుగా ఓకే అయిపోయింది. మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి విజయ్ – మారుతి కాంబినేషన్లో సెట్టయ్యే అవకాశం ఉంది. బాబు బంగారం తరవాత మారుతి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. హవీష్ కోసం మారుతి ఓ కథ సిద్దం చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.