మీడియా వాచ్ : షర్మిలకు కొండంత.. రేవంత్‌కు పిసరంత..!

తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ అంటే.. అవాక్కవ్వాల్సిన తెలంగాణ మీడియా గొప్పగా ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో సొంత రాష్ట్రం తెచ్చుకుని స్వయం పాలన చేసుకుంటున్న తెలంగాణలో పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన నేతలు పార్టీ పెడుతున్నామంటే కొన్ని మీడియా సంస్థలు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. షర్మిల రాజకీయ పార్టీ తొలి సమావేశం జరిగిన రోజున లోటస్ పాండ్ వద్ద కనీసం మూడువందల మంది కూడా లేరు. ఉన్న ఆ కొద్ది మందితో హడావుడి చేయడం.. హైప్ చేసుకోవడం బాగా తెలిసిన వైసీపీ స్ట్రాటజిస్టులు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆ గోరంతను మీడియా కొండతలుగా చూపించింది. చర్చోపచర్చలు పెట్టింది. అంతా ఓ స్ట్రాటజీ ప్రకారం నడిచిపోయింది.

అదే సమయంలో తెలంగాణ బిడ్డ … రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్రను ఒక్క మీడియా కూడా కవర్ చేయడం లేదు. సాధారణ వార్తల్లో కూడా చోటు కల్పించడం లేదు. మరి ఆయన పాదయాత్ర సాదాసీదాగా సాగుతుందా అంటే.. అదేం లేదు. అచ్చం పేట నుంచి కాలి నడకన బయలుదేరిన ఆయన… వెంట.. వేలాది మంది ఉన్నారు. రోడ్డు వెంట జన జాతర కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ పాదయాత్ర కిక్ ఇస్తోంది. ఐదు రోజులయింది కానీ మీడియాలో మాత్రం.. షర్మిలకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఐదు.. పది శాతం కూడా కేటాయించలేదు. దాంతో ఆయన పాదయాత్ర విశేషం.. ప్రత్యక్షంగా చూసే వారికి మాత్రమే తెలిసిపోతోంది.

ఇప్పుడు ప్రధాన మీడియా మొత్తం .. రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకుంది., వారిలోనూ యాజమాన్యం తెలంగాణకు చెందినవారే ఎక్కువ. టీవీ9, ఎన్టీవీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర చానళ్లు కూడా తెలంగాణ యాజమాన్యంలోనే ఉన్నాయి. అవి కూడా… రేవంత్ రెడ్డి పాదయాత్రకు కవరేజీ ఇవ్వడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా బిడ్డ ఎంత దున్నేస్తుందో చెప్పడానికే అవి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ మీడియా స్ట్రాటజీలను ఎవరు డిసైడ్ చేస్తున్నారో కానీ.. తెలంగాణ ప్రజలు.. పరాయి పాలన కోరుకుంటున్నారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారన్న చర్చ మాత్రం నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close