వెంకీతో మెహ‌రీన్‌??

మెహ‌రీన్ స్పీడు మామూలుగా లేదు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌తో హిట్ అందుకొన్న‌ప్ప‌టి నుంచీ నాన్ స్టాప్ గా చెల‌రేగిపోతోంది. ఇటీవ‌ల విడుద‌లైన మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ ల‌లో త‌నే హీరోయిన్‌. రెండు సినిమాలూ బాగా ఆడాయి. దాంతో మెహ‌రీన్ ల‌క్కీగాళ్ అయిపోయింది. ఇప్పుడామె చేతితో మ‌రో రెండు సినిమాలున్నాయి. మెల్ల‌మెల్ల‌గా అగ్ర క‌థానాయ‌కులూ మెహ‌రీన్‌పై దృష్టి పెడుతున్నారు. త్వ‌ర‌లోనే మెహ‌రీన్ వెంక‌టేష్ తో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఈ విష‌యాన్ని మెహ‌రీన్ కూడా చూచాయిగా అంగీక‌రించింది. ”వెంక‌టేష్‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమా కోసం నేను చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడే ఈ సినిమాకి సంబంధించిన వివ‌రాలు చెప్ప‌కూడ‌దు. ఎందుకంటే.. చ‌ర్చ‌లు ఇంకా జ‌రుగుతున్నాయి” అంది. ‘గురు’ త‌ర‌వాత కాస్త సైలెంట్ అయిన వెంకీ… ఇప్పుడిప్పుడే సినిమాల‌వైపు దృష్టి పెట్టాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడు వెంకీ. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో మెహ‌రీన్ దేంట్లో ఉన్న‌ద‌న్న‌ది కాస్త స‌స్పెన్స్‌. బ‌హుశా.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే చిత్రంలో మెహ‌రీన్‌ని క‌థానాయిక అయ్యుండే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా క‌న్‌ఫామ్ అయితే మెహ‌రీన్ కూడా బిగ్ లీల్ లోకి చేరిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.