అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరూ జంప్!!!

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూతో సహా 43మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి శుక్రవారం పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ (పిపిఏ) లో చేరిపోయారు. దానితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే మళ్ళీ మరోసారి కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. ఆయనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నంబం తుకి. ముఖ్యమంత్రితో సహా ఒకేసారి పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ పార్టీ వదిలి వెళ్ళిపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ విలీనం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

ఈసారి కూడా భాజపాయే తెర వెనుక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ భాజపా నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఈశాన్య రాష్ట్రాల సంకీర్ణ కూటమిలో భాగస్వామి. కనుక అది భాజపా కనుసన్నలలో నడుస్తుంటుంది.

రాష్ట్రంలో భాజపాకి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక వారితో కలిసి పిపిఏ త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత వాంగ్ కి లోవాంగ్ మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాపార్టీలో చేరడం స్వంత ఇంటికి వచ్చినట్లే భావిస్తున్నాను. దీని వెనుక భాజపా హస్తం ఉందనడంలో వాస్తవం లేదు,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిట్జు సమాధానం ఇస్తూ “ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసేందుకు డిల్లీ వచ్చినప్పుడు ఆమె వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకొన్నారు. అందుకే వారందరూ ఆగ్రహంతో పార్టీని విడిచిపెట్టి ఉండవచ్చునని భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలకి భాజపాని నిందించడం తగదు,” అని అన్నారు.

ఇదివరకు ఒకసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భాజపా కూల్చివేసింది. అప్పుడూ ఇలాగే తమకి సంబంధం లేదని వాదించింది. కానీ చివరికి సుప్రీం కోర్టు జోక్యంతో వెనక్కి తగ్గవలసివచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రి నబం తుకి స్థానంలో ఫెమ ఖండు భాద్యతలు చేపట్టారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి స్వయంగా పార్టీపై తిరుగుబాటు చేసి, తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకొని పిపిఏలో చేరిపోవడం, కాంగ్రెస్ పార్టీని దానిలో విలీనం చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. త్వరలో మళ్ళీ ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close