హ్యాపీ బర్త్‌డే చంద్రబాబు..! మోడీ, జగన్ విషెస్..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు… ఉండవల్లిలోని సీఎం ఇంటికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఈ రోజు కూడా.. అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై.. అక్కడ్నుంచి తిరుపతికి వెళ్తారు. అక్కడ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తారు. చంద్రబాబు తన 69 ఏళ్ల జీవితం పూర్తిగా రాజకీయంతోనే ముడిపడి ఉంది. విద్యార్థి నేతగా.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పని చేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా… సెంటర్ పాయింట్‌గా ఉంటూనే వస్తున్నారు.

గత ఏడాది పుట్టిన రోజున ఆయన… ధర్మపోరాట దీక్షలు ప్రారంభించారు. విజయవాడలో రోజంతా దీక్ష చేశారు. ఆ తర్వాత రాజకీయ పోరాటం ప్రారంభించారు. ఏడాది పాటు అలుపెరగకుండా… కేంద్రంపై పోరాటం చేశారు. మళ్లీ పుట్టిన రోజు వచ్చే సరికి.. ఆయన ఎన్నికల సమరం ముగించారు. ఫలితం… ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిస్తే.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అదో చరిత్ర అవుతుంది. కేంద్రంలో.. చక్రం తిప్పే అవకాశాలు ఈ ఏడాది మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఇరవై స్థానాల వరకూ గెలుచుకుంటే… కచ్చితంగా.. ఢిల్లీలో చంద్రబాబుది కీలక పాత్ర అవుతుంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. ఇప్పటికే…క్లారిటీ వచ్చేయడం.. గతంలో.. చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర ఇప్పటికీ.. తెర ముందే ఉండటంతో.. ఆయనకు కలసి రానుంది.

జాతీయ నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో… ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు 69వ వసంతంలో.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా… సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఆయన నిరంతర శ్రమ, పట్టుదలే కారణం. .. హ్యాపీ బర్త్ డే .. చంద్రబాబు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close