మోహన్ బాబు ఏం మాట్లాడినా సంచలనమే. వున్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన నైజం. అయితే అదే ఆయన్ని చిక్కుల్లో పడేస్తోంది. తాజాగా స్టార్ దర్శకులపై ఆయన కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. విష్ణు, మనోజ్ లు పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చెయ్యలేదు? మీరు రికమెండ్ చెయ్యలేదా? అని అడిగితే ”పెద్ద దర్శకుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్లకు ఊడిగం చేసే అవసరం నాకు లేదు. వాళ్ళని బతిమాలుకునే దుస్థితి పట్టలేదు. ఈనాటి చిన్న దర్శకుడే రేపటి పెద్ద స్టార్. అలాంటి వాళ్ళతోనే నా బిడ్డలు పనిచేస్తారు” అన్నారు.
రికార్డు వసూళ్లు గురించి చెబుతూ… ”ఆ లెక్కలన్నీ గ్యాస్. వచ్చేది కొంత. చెప్పేది కొండంత. ప్రస్తుతం ఏ నిర్మాత పరిస్థితి బాగోలేదు. కుక్కలు చింపిన విస్తరిలా మారింది. దర్శకులకు అవసరానికి మించిన పారితోషికం కట్టబెడుతున్నారు. వాళ్లేమో బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు“ అని నిర్మాతల తీరు తప్పుపట్టారు.
విష్ణు, మనోజ్ ఎదుగుతున్న దశలో వున్నారు. స్టార్ దర్శకులతో పనిచేయాలని వాళ్లకూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో స్టార్ దర్శకులపై విరుచుకుపడడం వారసుల కెరియర్ ని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టేదే.