తెలకపల్లి వ్యూస్ : అమరావతి నిర్మాణంపై మరింత చర్చ

శని,ఆదివారాలలో విజయవాడలో వున్నప్పుడు రాజధాని అమరావతి అధికారిక భవన సముదాయ నమూనాల ప్రదర్శన చూసేందుకు వెళ్లాను. విమర్శలు, వివాదాలు ఎలా వున్నా రాష్ట్ర రాజధాని నిర్మాణం చారిత్రిక అవసరం గనక అందరూ ఆహ్వానిస్తారు. అక్కడకు చాలామంది ఆసక్తిగా వచ్చి చూడటం, మాట్లాడుకోవడం, ఫోటోలు తీసుకోవడం కనిపించింది. అయితే అదే సమయంలో పెద్ద హౌటల్‌లో పెట్టారు గనక రెండే రోజులు ఉదయం పది గంటల నుంచి అయిదు గంటల వరకే సాగుతుంది గనక మరీ ఎక్కువ మంది చూసే అవకాశం లేదు. మామూలు వాళ్లం చూసినా సాంకేతికంగా వాటి మంచి చెడ్డలు చెప్పే పరిస్థితి వుండదు. ఉన్న మేరకు చూస్తే ఎలివేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ కోణాలు తీసుకున్నట్టు కనిపించింది. అయితే ప్రజారాజధాని అంటున్నారు గనక ప్రజల కోసం కేటాయించే భవనాలు స్థలాల వంటివి ఎక్కడా ప్రత్యేకంగా చూపించలేదని నాతోపాటు వచ్చిన మిత్రుడన్నారు. అది నిజమే.

ఒక అపార్ట్‌మెంట్‌ లేదా పెద్ద కాలనీ కట్టేప్పుడు ముందుగా ఆకర్షణ కోసం చూపించే నమూనాగా వుంది తప్ప దాని ప్రత్యేకతలేమిటి, పరిపాలనలో ప్రజల సౌలభ్యానికి ఎలా దోహదం చేస్తుంది వంటి అంశాలు అక్కడ చూపడం గాని చెప్పడం గాని లేదు. ప్రభుత్వం తరపున లేదా క్రిడా తరపున కూడా ఎవరూ పెద్దగా వివరిస్తున్నదీ లేదు. లాంఛనప్రాయమైన ప్రజాసందర్శన అభిప్రాయ సేకరణగానే నడుస్తున్నది. ఒకరిద్దరు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారికి పెద్దగా ఆసక్తి లేదు.

పోటీకి వచ్చిన రకరకాల డిజైన్లను మొదట ప్రదర్శించారు. ఎంపిక చేసిన జపాన్‌ కంపెనీ మ్యాకీ డిజైన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికీ ల్యాండ్‌మార్క్‌ల వంటివి ఎలా వుండాలో ఖరారు కాలేదు. ప్రజల పునరావాసానికి ఉపాధికి సంబంధించిన అంశాలు కూడా అలాగే వున్నాయి. అవన్నీ ముందుకు నడిస్తేనే నిజంగా రాజధాని మొదలు. ఒక నగరం నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు పాలన నివాస సముదాయాలే చూపిస్తున్నారే అని కూడా కొందరు అడిగారు. డిజైన్‌ ఎక్కడ తీసుకున్నా స్థానికంగా వుండే సాంకేతిక నిపుణులు యువతరంతో కూడా చర్చించితే బావుంటుందని చాలామంది అనుకోవడం వినిపించింది. చతురతకు మారుపేరైన చంద్రబాబు నాయుడు పని జరుగుతుందని కష్టపడుతున్నానని ప్రజలకు చూపించేందుకే ఈ నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారన్నది మాత్రం స్పష్టం.

ఇదే సమయంలో మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో భూముల అమ్మకం గురించి మాట్లాడారు. ఇందులో స్థానికులకే ప్రాధాన్యత నిస్తామన్నారు. రైతుల నుంచి భూమి తీసుకుని వాణిజ్య వర్గాలకు అమ్మడం జరిగితే అది కొత్త అనుభవమే. ఆదాయం కోసం వినోద కేంద్రాలు, ప్లాజాలు పార్కులు మాల్స్‌ వంటివాటికే విశాల స్థలాలు కేటాయించి ప్రజావసరాలను విస్మరిస్తే అప్పుడది వాణిజ్య రాజధాని అవుతుంది గాని ప్రజా రాజధాని కాదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close