ఆ ఎన్నికలు ఆపేందుకు కేసీఆర్ నో..!

కరోనా వ్యాప్తి కారణంగా నైట్ కర్ఫ్యూ దశకు చేరిన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మాత్రం యథావిధిగా జరగనున్నాయి. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ముప్పయ్యో తేదీన పోలింగ్ జరగనుంది. అయితే పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. తాము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని…ఎన్నికల సంఘం.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని ఎస్‌ఈసీ అనుకుంది. వెంటనే… ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. అయితే దీనిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోలేరు కాబట్టి… సమాచారాన్ని సీఎం కేసీఆర్ వద్దకు పంపించారు. ఆయన ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయంతో ఉండటంతో.. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ఎస్‌ఈసీకి సమాచారం పంపింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు.. అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఖాయంగా జరగనుంది. ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో.. టిక్కెట్ల ఖరారులో పార్టీలు బిజీగా ఉన్నాయి.

రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. వారం రోజుల ప్రచార గడువు ఉంటుంది. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన ఉంది. అందుకే ఎన్నికల ప్రచారం విషయంలో కఠిన నిబంధనలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించారు కాబట్టి… ఎన్నికల నిర్వహణకు అడ్డంకేమీలేదని.. టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close