నాగ అశ్విన్ ఏం చేస్తున్నాడో..?

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం తో అరంగేట్రం చేశాడు నాగ అశ్విన్‌. ఆ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `మ‌హాన‌టి` అయితే.. ద‌ర్శ‌కుడిగా నాగ అశ్విన్‌పై గౌర‌వాన్ని పెంచేలా చేసింది. మ‌హాన‌టి వ‌చ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయితే ఈలోగా నాగ అశ్విన్ నుంచి మ‌రో సినిమా ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. చిరంజీవి కోసం అశ్విన్ ఓ క‌థ త‌యారు చేస్తున్నాడ‌ని అప్ప‌ట్లో చెప్పారు. అయితే ఆ మాట ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యింది. చిరంజీవి తో సినిమా అనే ఆలోచ‌న ప‌క్క‌న పెట్టి త‌న స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. నాగ అశ్విన్ ఓ క‌థ‌ని రెడీ చేసేశాడు. టాలీవుడ్ స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. నాని, శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ ముగ్గురు హీరోల్లో ఒక‌రిని ఫిక్స్ చేసే అవ‌కాశాలున్నాయి. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తోంది. ఎవ‌రి డేట్లు అందుబాటులో ఉన్నాయో చూసుకుని, వాళ్ల‌తో సినిమా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. ఏప్రిల్ – మేల‌లో నాగ అశ్విన్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close