వీర జవాను కుటుంబానికి యువ హీరో నాగశౌర్య ఆర్థిక సాయం

సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు. ఈనెల 5న జమ్మూ కాశ్మీర్ సమీపంలోని కుప్పవాడ ప్రాంతంలోని అంద్వారా వద్ద జరిగిన కాల్పుల్లో విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొట్ట సత్యం వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన సత్యం భార్య శ్రీవాణి బొబ్బిలిలోని స్థానిక గొల్లవీధిలో నివాసముంటున్నారు. ఆ ఇంటికి హీరో నాగశౌర్య స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి మేమంతా అండగా ఉంటామన్నారు. ఎప్ప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం 50 వేల రూపాయలను పిల్లల పేరు మీద పిక్స్ డ్ డిపాజిట్ చేశారు.

ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ…దేశ రక్షణ కోసం వీర జవాన్ సత్యం… పోరాడి అసువులు బాశారు. అలాంటి వీరుడి కుటుంబాన్ని పరామర్శించడం నా బాధ్యతగా భావించాను. అందుకే కుటుంబ సభ్యుల వద్దకు నేరుగా వెళ్లి ఓదార్చాలని నిర్ణయించుకొని… ఇక్కడికి వచ్చాను. మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే సైనికుల పుణ్యమే. వీర జవాను కుటుంబానికి నేను చేసింది చిరు సాయమే. మా కుటుంబం స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. చిత్ర పరిశ్రమ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close