మెగా హీరోయిన్‌కు అడ్డుచెబుతున్న అభిమానులు

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ల కుమార్తెలు హీరోయిన్‌లుగా చేయటం, మంచి విజయాలు చేజిక్కించుకోవటం బాలీవుడ్‌లో సర్వసాధారణం. రాజ్ కపూర్ వంశానికి చెందిన కరిష్మా కపూర్, కరీనా కపూర్, శతృఘ్నుసిన్హా కూతురు సోనాక్షి సిన్హా, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఈ కోవలోకి వస్తారు. తమిళంలోకూడా కమలహాసన్ కుమార్తెలు శృతిహాసన్ కూడా తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఎడాపెడా సినిమాలు చేయటం తెలిసిందే. అర్జున్ కుమార్తె ఐశ్వర్య, శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మికూడా ఒకటి రెండు సినిమాలలో హీరోయిన్‌లుగా తళుక్కుమన్నారు. అయితే అది మరెక్కడయినా సాగుతుందేమోగానీ, టాలీవుడ్‌లో అది అంత వీజీ కాదు. సుమారు 20 ఏళ్ళక్రితం కృష్ణ కుమార్తె మంజులను బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా బక్ చేసినపుడు కృష్ణ అభిమానులు భగ్గుమన్నారు. కృష్ణ ఇంటికి, పద్మాలయా స్టూడియోకు వెళ్ళి ఆందోళనకు దిగారు. కిరసనాయిలు పోసుకుంటానికికూడా సిద్ధపడ్డారు. వారి గొడవకు తలొగ్గి కృష్ణ మంజుల రంగప్రవేశాన్ని ఆపేయించారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక రంగప్రవేశానికికూడా అదే సమస్య ఎదురవుతోంది.

నీహారిక హీరో నాగశౌర్య పక్కన రామరాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోయిన్‌గా బుక్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారట. ఇటీవల కొందరు అభిమానులు నాగబాబును కలిసి నీహారికను సినిమాలలోకి రానివ్వొద్దని కోరారట. అయితే నీహారిక గౌరవప్రదంగా ఉంటే పాత్రలలోనే నటిస్తుందని, నటన అనేది తప్పేమీ కాదని, అదొక మంచి వృత్తి అని నాగబాబు వారికి సర్దిచెప్పటానికి ప్రయత్నించారట. అయితే నీహారికకు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయా, లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమయింది. ఈ చిత్రం లాంచ్ కార్యక్రమం దసరా రోజు జరగనుందని, ఆ రోజు చిరంజీవి హాజరయితే నీహారికకు ఆయన ఆశీస్సులు ఉన్నట్లని, ఆయన హాజరు కాకపోతే లేనట్లేనని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close