మహాభారతంలో అయినా ఛాన్స్ దొరికితే బాగుండును

రాజమౌళి దర్శకత్వంలో విడుదలయిన బాహుబలి సినిమాని చూసి నటీ నటులందరూ అటువంటి సినిమాలో నటించే అవకాశం తమకు దక్కనందుకు చాలా బాధపడుతున్నారు.అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి వంటి అనేక సినిమాలలో నటించి మెప్పించిన నాగార్జున కూడా బాహుబలి సినిమాలో తనకి అవకాశం రానందుకు బాధపడుతున్నాని చెప్పారు. మహాభారతంసినిమా తీయడమే తన కల అని దర్శకుడు రాజమౌళి ఇటీవల బయటపెట్టారు. మరి నాగార్జున ఆ మాట విన్నారో లేక యాదృచ్చికంగా అన్నారో తెలియదు కానీ తనకు తన తండ్రి స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు, స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టమని, తనకు ఎప్పటికయినా అటువంటి పౌరాణిక పాత్రలు చేయాలని ఆశాపడుతున్నానని అన్నారు.

ఒకవేళ రాజమౌళి త్వరలో మహాభారతం సినిమా తీసినట్లయితే అందులో తనకీ అవకాశం ఇస్తే సంతోషిస్తానని చేపుతున్నట్లే ఉంది నాగార్జున మాటలు వింటే. అన్నమయ్య, రామదాసు వంటి సినిమాలతో ఇప్పటికే తన సత్తా చాటుకొన్న నాగార్జునకి పౌరాణిక పాత్రలు అవలీలగానే చేసి మెప్పించగలదని భావించవచ్చును. దర్శకుడు రాజమౌళి ఆయన అభ్యర్ధనను మన్నిస్తారో లేదో తెలియదు కానీ నాగార్జున చెప్పిన ఈ మాటతో ఆయన మహాభారతంలో ఆయన ఏ పాత్రకి సరిపోతారో ఆలోచించడానికి అవకాశం కల్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close