‘ఆఫీసర్’ టీజర్: నాగార్జునతో వర్మ ఏం చేస్తాడో?

రామ్‌గోపాల్ వ‌ర్మ‌ రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో తప్ప స్టార్ హీరోలు ఎవరితోనూ సినిమాలు చేయలేదు. తెలుగులోనూ అంతే. అటువంటి సమయంలో వర్మకు నాగార్జున అవకాశం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఆఫీసర్’ని ఏం చేస్తాడో? అని అభిమానులు కంగారు పడ్డారు. వాళ్ల కంగారుకి తగ్గట్టు మధ్యలో పోర్న్ ఫిల్మ్ ‘జీఎస్టీ’ మీద వర్మ ఫోకస్ చేశాడు. వీటన్నిటి మధ్య ‘ఆఫీసర్’ షూటింగ్ పూర్తయింది. ఈ రోజు టీజర్ విడుదలైంది. రెగ్యులర్ వర్మ సినిమాల స్టయిల్‌లోనే వుందీ టీజర్. గ్యాంగ్‌స్ట‌ర్‌, మాఫియా వర్సెస్ పోలీస్ కథే. కాకపోతే దీనికి వర్మ కూతురి సెంటిమెంట్ జోడించినట్టు అర్థమవుతుంది. ‘వాడు హైదరాబాద్ నుంచి వచ్చి ముంబై లో మనల్ని పీకుతాడా!’ అని విలన్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా లేదు. ఇక, ‘మొదలుపెట్టినదాన్ని పూర్తిచేయడం నా బాధ్యత’ అని నాగార్జున చెప్పిన డైలాగ్… సినిమా మొదలుపెట్టాను కనుక పూర్తి చేయాలనట్టు వుంది. అలాగని, సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. నాగార్జున ఏదో కొత్తదనం లేకపోతే ఇటీవల ఒప్పుకోవడం లేదు. వర్మ సత్తానూ తక్కువ చేసి చూడలేం. టీజర్ సోసోగా వున్నా… సినిమాలో ఏమైనా వుంటుందేమో. ప్రస్తుతానికి ఈ టీజ‌ర్‌లో వర్మ పీకింది ఏమీ లేదు. సినిమాలో ఏం పీకుతాడో? ఏం చేస్తాడో? వెయిట్ అండ్ సి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.