ప్ర‌భాస్‌తో సినిమా పుకారే…

ప్రభాస్‌ని కలిసినట్టు… ప్ర‌భాస్‌తో సినిమా చేయబోతున్నట్టు… ప్ర‌భాస్‌తో కథ గురించి డిస్కస్ చేసినట్టు… మీడియాలో (తెలుగు360లో కాదు) వచ్చిన వార్తలన్నీ ‘అవాస్తవాలు, కల్పితాలు’ అని దర్శకుడు సుకుమార్ స్పష్టం చేశాడు. ‘రంగస్థలం’ విజయం తరవాత సుకుమార్ దర్శకత్వం వహించబోయే సినిమాలో ఎవరు? ఏ హీరోతో ఆయన సినిమా చేస్తారు? అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఆసక్తికి తోడు మొన్నీమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘యువ హీరోలు అందరితో చేశా. ప్రభాస్‌తో చేయాలనుంది’ అని సుకుమార్ చెప్పడంతో… ఇద్దరూ సినిమా చేయబోతున్నారని వార్తలు రాసేశారు. కానీ, ఈ దర్శకుడి మనసులో కొన్నాళ్లు విరామం తీసుకోవాలని వుందని మేము చెప్పాం. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ అదే చెప్పారు. “ప్రభాస్‌తో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు అబద్దాలే. టైమ్ లేక మేమిద్దరం ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నట్టు రాశారు. అవన్నీ కల్పితాలే” అని సుకుమార్ పేర్కొన్నారు. అదండీ సంగతి. సుకుమార్ నెక్స్ట్ సినిమా గురించి తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. ‘రంగస్థలం’ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.