ఏఎన్నార్ అవార్డు ఎవ‌రికి?

ఏఎన్నార్ జాతీయ అవార్డు పేరుతో అక్కినేని అవార్డులు ఇవ్వ‌డం మొద‌లెట్టారు. ఆ ప‌రంప‌ర‌ని త‌ద‌నంత‌రం నాగార్జున కొన‌సాగిస్తూ వ‌చ్చారు. గ‌తేడాది అమితాబ్‌బ‌చ్చ‌న్‌కి ఈ అవార్డు అందించారు. 2019 సంవ‌త్స‌రానికి గానూ అవార్డు ఎవ‌రికి ఇవ్వ‌బోతున్నార‌న్న విష‌యాన్ని రేపు ఉద‌యం స్వ‌యంగా నాగార్జునే ప్ర‌క‌టిస్తారు. అవార్డు ఎవ‌రికి వెళ్తుంద‌న్న విష‌యాన్ని నాగ్ చాలా ర‌హ‌స్యంగా ఉంచారు. అయితే ఈసారి అవార్డు తెలుగు నుంచి ఓ అగ్ర క‌థానాయ‌కుడే ద‌క్క‌బోతోంద‌ని స‌మాచారం. ఆ క‌థానాయ‌కుడితో నాగ్‌ని వ్య‌క్తిగ‌త‌, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. చిత్ర‌సీమ‌లో నాగ్ అత్యంత స‌న్నిహితంగా మెలిగేది ఆ హీరోతోనే. ఆ స్నేహ బంధాన్ని అక్కినేని అవార్డుతో ఇంకాస్త ప‌రిపుష్టం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా… అవార్డు ఎవ‌రిక‌న్న‌ది ఇంకొద్ది గంట‌ల్లో తేలిపోతుంది. అవార్డు ఎవ‌రికి ద‌క్కినా, ప్ర‌దానం మాత్రం ఈనెల 18నే అని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close