విజయ్ కి పోటీగా నమిత.. ఫ్యాన్స్ రియాక్షన్

తమిళనాడు ‘సినీ’ రాజకీయాలకు కేంద్ర బిందువు. సినీ తారలు ముఖ్యమంత్రులుగా వెలుగొందిన రాష్ట్రమది. 2026 లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల సినీ తారల సందడి మరోస్థాయిలో ఉండబోతుంది. హీరో విజ‌య్ రానున్న తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా ఇటీవ‌లే ‘తమిళక వెట్రి కజగం’ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయనపై పోటీకి దిగే సినీతార కూడా సిద్దమయ్యారు. హీరోయిన్ న‌మిత విజయ్ పై పోటీకి దిగుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థిగా బ‌రిలో దిగుతున్నట్లు తెలిపిన నమిత, విజ‌య్‌ కి ప్రత్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజ‌కీయ ఎదుగుద‌ల ఉంటుందని, అందుకే విజ‌య్‌పై పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నాని కొచ్చారామె. ప్రస్తుతం న‌మిత త‌మిళ‌నాడు బీజేపీ పార్టీ కార్యవ‌ర్గ స‌భ్యురాలిగా వున్నారు. అయితే నమిత చేసిన ప్రకటన అప్పుడే సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబితే.. విజయ్ అభిమానులు మాత్రం డిపాజిట్లు కూడా రావని కామెంట్లు పెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close