చాలా రోజులు జైల్లో ఉండి వచ్చినప్పటికీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తీరు మారలేదు. రాజు అనే వ్యక్తిపై దాడి చేసి మరోసారి కేసుల్లో ఇరుక్కున్నారు. సురేష్ చేతిలో దెబ్బలు తిన్న రాజు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చూపించి రిమాండ్ కు తరలిస్తారా.. స్టేషన్ బెయిల్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.
నందిగం సురేష్ రాజధాని వ్యవహారాల్లో జగన్ కుట్రలు అమలు చేయడంలో మొదటి అడుగు వేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చెరుకు తోటలకు నిప్పు పెట్టేవారు. ఈ వ్యవహారంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఆధారాల్లేకపోవడంతో బయటపడ్డారు. ఈ పనులు చేయడంతో జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత ఇసుక సహా ఇతర వ్యవహారాలతో పెద్ద ఎత్తున సంపాదించారు. చివరికి యాత్ర సినిమాకు డబ్బులు బ్లాక్ మనీ అంతా సురేషే పెట్టారని చెబుతారు. అందుకే ఈ సినిమాలోఆయన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.
దాడులు, దౌర్జన్యలతో అమరావతి ప్రాంతంలో హంగామా చేసేవారు. ఇప్పటి మంత్రి సత్యకుమార్ యాదవ్ నూ వదిలి పెట్టలేదు. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు నడిపించారు. అమరావతి రైతులపై దాడులు చేయించేవారు. కూటమి ప్రభుత్వం పారిపోయారు. అయితే హైదరాబాద్ లో పట్టుకుని తీసుకు వచ్చి జైలుకు పంపారు. బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా దందాలు మాత్రం మారడం లేదు.