రివ్యూ :రొమాంటిక్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ‘జెంటిల్‌మ‌న్’

ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణ గారి వీర ప్రేమ గాధ, వంటి సక్సెస్ మూవీస్ తో సూపర్ ఫాస్ట్ గా దుసుకేల్తున్న నాని, లేటెస్ట్ జెంటిల్‌మెన్ గా ఈ రోజు(17.06.2016) మీ ముందుకు వచ్చాడు. నివేదా థామస్, సురభి హీరోయిన్ లు గా, చాల కాలం తరువాత శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం, నాని కి మరో హిట్ ఇచ్చిందా…? జెంటిల్‌మెన్ ఫై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు..మరి వారి అంచనాలకు ఏ మాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఫారెన్ ట్రిప్ నుండి ఇండియాకు తిరిగి వస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఐశ్వర్య (సురభి), క్యాథరిన్ (నివేదిత థామస్) లు ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుని స్నేహితులుగా మారి టైమ్ పాస్ కోసం తమ తమ లవ్ స్టోరీలను ఒకరికొకరు చెప్పుకోవాలనుకోవడంతో సినిమా కథ మొదలవుతుంది క్యాథరిన్, గౌతమ్ (నాని ) ని , ఐశ్వర్య, జయరాం (నాని ) లను ప్రేమిస్తారు..ఇద్దరు వారి ప్రేమలను చెప్పడం పూర్తి ఆయెలోపు హైదరాబాద్ వస్తుంది..ఇద్దరు ఫ్లైట్ దిగి వస్తుండగా , బూకే తో జయరాం ఐశ్వర్య కు వెల్ కం చెప్పడం చూసి షాక్ తిన్న క్యాథరిన్, వెంటనే గౌతమ్ ఇంటికి వెళ్ళగా తను చనిపోయాడని తెలుస్తుంది..ఈ లోపు ఓ టీవీ రిపోర్టర్ నిత్య ( శ్రీముఖి ) క్యాథరిన్ తో గౌతమ్ ఆక్సిడెంట్ లో చనిపోలేదు హత్య చేసారని చెప్పడం తో ఆ హత్య ఎవరు చేసారు అనే కోణం లో వెతుకుతుంటే అసలు నిజం తెలుస్తుంది..జై కూడా క్యాథరిన్ కు దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తుంటాడు. ఆ టైమ్ లోనే క్యాథరిన్ కు దొరకబోయే ఒక్కొక్క సాక్ష్యాన్ని మాయమవుతూ ఉంటుంది. దీంతో క్యాథరిన్ గౌతమ్ ను చంపింది జై అని నిర్ణయించుకుని అతని అసలు రూపాన్ని ఐశ్వర్యకు చూపాలనుకుంటుండగా ఒక నిజం బయటపడుతుంది. ఇంతకి క్యాథరిన్ కి తెలిసిన నిజం ఏంటి..? గౌతమ్ ఎలా చనిపోతాడు..? గౌతమ్ కు జయరాం కు సంబందం ఏంటి..? అనేది మిగతా కథ తెరఫై చూడాల్సిందే…

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

గౌతమ్, జయరాం గా రెండు విభిన్న పాత్రలలో నాని యాక్టింగ్ అదరగొట్టాడు..మొదటిసారి పాజిటివ్ & నెగటివ్ క్యారెక్టర్ లలో బాగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు..నివేదా థామస్‌కు మొదటి చిత్రం అయిన ఎక్కడ కూడా అలా కనిపించకుండా నటించింది…సురభి ఒకే అనిపించింది.. ఇప్పటివరకు కామెడీ పాత్రలతోనే కనువిందు చేసిన అవసరాల శ్రీనివాస్‌ విలన్ రోల్ లో ఇలా కూడా చేస్తాడా అనుకునే విధంగా నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ , సత్యం రాజేష్ ఏదో కామెడీ చేయాలనీ ట్రై చేసారు కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేకపోయింది.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా చెప్పాల్సింది డేవిడ్ నాథన్ అందించిన కథ, దానికి తగినట్టు దర్శకుడు మోహన్ ఇంద్రగంటి కథను నడిపిన విధానం బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏయే అంశాలు కావాలో అన్నింటినీ దర్శకుడు తన కథనంలో పొందుపరిచి ఊహించని మలుపులతో మంచి కిక్కే ఇచ్చాడు. అలాగే సినిమాలోని నాని రెండు పాత్రలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుడికి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి భాగంలో అప్పటి వరకూ ఉన్న నాని రెండు పాత్రల్లో ఒక పాత్రను చంపేయడంతో దర్శకుడు అసలు కథను మొదలుపెట్టిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో అన్నఆసక్తి పెరుగుతుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చూసే ప్రేక్షకుడికి ఎక్కడో ఒక దగ్గర ఆ ట్విస్ట్ ఊహకు అందుతుంది. కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రేక్షకుడికి ఆ చాన్స్ ఇవ్వలేదు. పైగా సినిమా పూర్తయ్యే సమయానికి అసలు కథ ఏ సంఘటనతో మొదలైందో చెబుతూ దర్శకుడు ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం బాగుంది. మైనస్ పాయింట్ గా చెప్పాల్సి వస్తే కథ బాగానే ఉన్నప్పటికీ ఆ కథను చెప్పడానికి మరీ నిడివి పెంచాల్సిన అవసరం లేదు. నిడివి పెంచాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు మొదట్లో ప్రేమ జంటల మధ్య అనవసరమైన కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినట్టు అనిపించాయి. మణిశర్మ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ తో సినిమాకు ప్రాణం పోసాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ పి.జి.వింధ కెమెరా పనితనం చాల బాగుంది.ఎన్నో భారి చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

చివరి వరకు కూడా ఎవరు ఎవర్ని చంపారు అనేది తెలియకుండా ప్రేక్షకులను టెన్షన్ కు గురిచేసే చిత్రం.. రొటీన్ కథలతో విసిగిన ప్రేక్షకులకు రొమాంటిక్‌ సస్పెన్స్ థ్రిల్లర్ రూపంలో ఓ మంచి చిత్రాన్ని అందించడానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి చేసిన ప్రయత్నమే ఈ ‘జెంటిల్‌మ‌న్’. ఒక మనిషి తనకు కష్టం కలుగుతున్నా తన వల్ల నష్టపోయిన వ్యక్తి కోసం నిస్వార్థంగా పాటుపడితేనే అతను నిజమైన జెంటిల్‌మ‌న్ అవుతాడన్న సత్యాన్ని సినిమా ద్వారా చెప్పడం అనేది మంచి ప్రయత్నం. సినిమా ఇంటర్వెల్ వచ్చే సస్పెన్స్ , క్లైమాక్స్ లో రివీల్ అయిన ట్విస్ట్ సినిమాకే హైలెట్. కానీ అక్కడక్కడా కథనాన్ని సాగదీయడం, కొన్ని బలవంతపు ప్రేమ సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. కామెడి పండలేదు, మొత్తంగా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లింగ్స్ ఇష్టపడే వాళ్ళు, నానీ నుండి డిఫరెంట్ సినిమాని కోరుకునే వాళ్ళు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్ అందర్ని ఆకట్టుకునేల తీసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు..చివరాఖరికి చెప్పెదేటంటే…నాని ఖాతా లో మరో హిట్ మూవీ, ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇచ్చే ‘జెంటిల్‌మెన్‌’….

తెలుగు360.కామ్ రేటింగ్ 3/5
బ్యానర్ : శ్రీ దేవి మూవీస్,
నటి నటులు : నాని, నివేదా థామస్, సురభి, శ్రీనివాస్ అవసరాల,ఆనంద్,తనికెళ్ళ భరణి,వెన్నెల కిషోర్,సత్యం రాజేష్, రమాప్రభ, ప్రగతి,రోహిణి తది తరులు…..
కథ : అర్.డేవిడ్ నాథన్,
పాటలు : సిరి వెన్నెల, రామ జోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్,
సినిమాటోగ్రాఫర్ : పి.జి.వింధ,
ఎడిటర్ :మార్తాండ్ కె .వెంకటేష్,
సంగీతం : మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఇంద్రగంటి మోహన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close