నాని సినిమా ఎలా ఉండ‌బోతోంది?

నేచుర‌ల్ స్టార్ నానిలో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. వాల్ పోస్ట‌ర్ అనే బ్యాన‌ర్ స్థాపించి…. సినిమాలు తీస్తున్నాడు నాని. ఇందుకోసం బంజారా హిల్స్‌లో ఓ ఆఫీస్ కూడా తెరిచాడు. ‘అ’ సినిమా ఈ బ్యాన‌ర్ నుంచే వ‌చ్చింది. తాజాగా మ‌రో సినిమాకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ఆస్ట్రేలియాలో చ‌దువుకుని వ‌చ్చిన ఓ కుర్రాడు నానికి క‌థ చెప్పి మెప్పించాడు. డైలాగ్ వెర్ష‌న్‌తో స‌హా… స్క్రిప్టు సిద్ధంగా ఉంద‌ని, నాని ఈ క‌థ విన‌గానే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని, ఒక్క మార్పు కూడా చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. ఇదో థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. ‘అ’లాగే ప్ర‌యోగాత్మ‌కంగా ఉంటూనే క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో సాగ‌బోతోంద‌ట‌. ఒక్క పాటకు కూడా ఛాన్స్ లేని సినిమా ఇది. మొద‌టి స‌న్నివేశం నుంచి, చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ ప్రేక్ష‌కుడ్ని సీటు అంచున కూర్చోబెట్ట‌గ‌లిగేంత ఆసక్తిక‌రంగా ఈ క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. ఓ యాక్ష‌న్ ఇమేజ్ ఉన్న క‌థానాయ‌కుడికి ఈ క‌థ సూట‌వుతుంద‌ని తెలుస్తోంది. ఆ క‌థానాయ‌కుడి కోసం వేట సాగుతోంది. ఈ సినిమా వ‌ర‌కూ నాని కేవ‌లం నిర్మాత‌గానే ఉండిపోబోతున్నాడు. ఆగ‌స్టులో ఈ చిత్రం ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close