‘నాన్నకు ప్రేమతో..’ టీజర్‌కు ఒక్కరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌, 25 వేల లైక్స్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’. ఈ చిత్రం టీజర్‌ విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఈ టీజర్‌కు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌, లైక్స్‌ లభించాయి.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం విడుదలైన ‘నాన్నకు ప్రేమతో..’ టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్కరోజులోనే ఈ టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌ లభించడం విశేషం. అలాగే 25 వేల లైక్స్‌ కూడా రావడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా లుక్‌తో కనిపించే ఈ చిత్రం టీజర్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుందని, తప్పకుండా ఎన్టీఆర్‌ కెరీర్‌లో ‘నాన్నకు ప్రేమతో..’ పెద్ద హిట్‌ సినిమా అవుతుందని చెప్తున్నారు. నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నాం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close