సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా.. సమస్యను అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను ఎంపిక చేసుకుని.. వాటిలో బెస్ట్ ఆప్షన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం క్రైసిస్ మెనేజ్మెంట్. ఈ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు. నేపాల్ సంక్షోభంలో తెలుగు వాళ్లు చిక్కుకున్నారని తెలిసిన మరుక్షణం, సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారని తెలిసిన మరుక్షణం ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇరవై నాలుగు గంటల్లో వారు సురక్షితంగా ఏపీకి వస్తున్నారు.
ముందుగా చిక్కుకున్న తెలుగువారికి భరోసా
నేపాల్లో తెలుగు వారు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే.. వివిధ మార్గాల ద్వారా మొత్తం ఎంత మంది ఉన్నారో.. అంచనా వేశారు. వారికి ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లేలా చేశారు. ఎవరూ కంగారు పడవద్దని.. అందర్నీ సురక్షితంగా ఆంధ్రకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఇంటర్నెట్ ఇతర సదుపాయాలు లేకున్నా.. వారిని ప్రభుత్వం నిరంతరం మానిటర్ చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించారు.
వెంటనే ..భారత భూభాగంలోకి తెచ్చే ఏర్పాట్లు !
కేంద్ర ప్రభుత్వ విభాగాలతో కలసి.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని గుర్తించడంతో పాటు వారిని వీలైనంత త్వరగా.. భారత భూభాగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేశారు. చాలా మందిని బుధవారం అర్థరాత్రి సమయానికే బీహార్ లోకి తీసుకు వచ్చారు. మరికొంత మందిని తీసుకు వచ్చే ప్రక్రియ చేపట్టారు. ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా..భయపడకుండా.. వారిని భారత భూభాగంలోకి తెచ్చి.. అక్కడినుంచి ఢిల్లీకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంచారు.
ఆర్టీజీఎస్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్
ఏపీ ప్రభుత్వానికి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ ఆర్టీజీఎస్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. పక్కా సమాచారంతో.. అక్కడి నుంచి సహాయకార్యక్రమాలను పర్యవేక్షించవచ్చు. నారా లోకేష్ .. ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థను పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. కూటమి సభలో తాను పాల్గొనడం కన్నా.. నేపాల్ లో చిక్కుకున్నాయి ప్రజలకు అండగా ఉండేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. లోకేష్ చేసిన ప్రయత్నానికి .. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వాళ్లు కూడా ఫైర్ స్టార్ రేటింగ్ ఇస్తారు. లోకేష్ .. సంక్షోభ సమయాల్లోనూ సమర్థంగా నాయకత్వం వహించగల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.