సినిమాలకు గ్లింప్స్‌లు, టీజర్లు హైప్ క్రియేట్ చేస్తాయి. నారా లోకేష్.. ఏపీకి వస్తున్న పెట్టుబడులపై ఆసక్తి కల్పించడానికి అదే పద్దతిని పాటిస్తున్నారు. బుధవారం ఓ ట్వీట్ చేసి.. అందర్నీ ఆ పెట్టుబడి ఏమిటబ్బా అని ఆశ్చర్యపోయేలా చేశారు. గురువారం మరో ట్వీట్ చేశారు. ఓ అంతర్జాతీయ ఫండ్ ఏపీలో భారీ పెట్టుబడి ప్రకటించబోతోందని.. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు తాను ప్రకటిస్తానన్నారు. ఈ లోపు అంచనా వేయాలని నెటిజన్లకు సూచించారు.
అంతర్జాతీయ ఫండ్ అంటే ఏదో భిన్నమైన పెట్టుబడి రాబోతోందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ పెట్టుబడి ఎంవోయూ జరగనుననట్లుగా తెలుస్తోంది. బుధవారం ఇలా టీజర్ విడుదల చేశారు. అన్నట్లుగానే .. రెన్యూపవర్ గురించి ప్రకటన చేశారు. గతంలో ఈ సంస్థ పెట్టుబడులు ప్రకటించి వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ ముందుకు వచ్చింది. శుక్రవారం ప్రకటించబోయే పెట్టుబడి గతంలో వచ్చి వెనక్కి వెళ్లిపోయింది కాదని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడినే లోకేష్ ప్రకటించనున్నారు.
ఐదు సంవత్సరాల్లో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యాన్ని లోకేష్ నిర్దేశించుకున్నారు. దాని కోసం నిరంతరాయంగా శ్రమించి పెట్టుబడులను సమీకరిస్తున్నారు. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఏపలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇవ్వని ఇన్సెంటివ్స్ ఇస్తూ.. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలతో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

