జరిగినదంతా మా ఘనత..జరగనిది చంద్రబాబు వైఫల్యం..! గుంటూరులో మోడీ చెప్పిందిదే..!

ప్రధానమంత్రి హోదాలో గుంటూరు పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీ.. చంద్రబాబుపై తనకు ఉన్న కోపం అంతా తీర్చుకున్నారు. తన ప్రసంగంలో ఎనభై శాతం చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు. ఏపీలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే.. అది తమ ఘనతేనని.. జరగనిది.. ఏదైనా ఉంటే అది చంద్రబాబు వైఫల్యమేనని చెప్పుకొచ్చారు. ఏం చేశారో చెప్పలేదు.. చంద్రబాబు ఏం చేయాలేకపోయారో చెప్పలేదు. గుంటూరు గొప్పతనాన్ని పొగిడేసి… తాను.. గుంటూరు నుంచి స్విచ్చాన్ చేసిన.. రెండు చిన్న చిన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల కు చెందిన ప్రాజెక్టుల గురించి పావుగంటకుపైగా మాట్లాడిన మోడీ.. తర్వాత చంద్రబాబు ఎటాక్ చేశారు.

చంద్రబాబును.. వెక్కించడానికి మోడీ ఎక్కువ సమయం తీసుకున్నారు. మోడీ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన మరింత ఎగతాళి చేసేలా మాట్లాడారు. చంద్రబాబు.. వెన్నుపోటు రాజకీయాల్లో సీనియర్ అని.. పార్టీ ఫిరాయింపులు చేయడంలో, కొత్త కూటములు కట్టడంలో సీనియర్ అని మండిపడ్డారు. ఎవర్ని తిడతారో..వారి ఒళ్లో కూర్చోవడంలో , మాటలు మార్చడంలో చంద్రబాబు సీనియర్ అని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి , ప్రజాసంక్షేమంలో తానే గొప్ప అని ప్రకటించుకున్నారు. ఏపీని మారుస్తానని చెప్పి.. చంద్రబాబే మారిపోయారు. యూటర్న్ తీసుకున్నారని.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అమరావతిని గొప్పగా నిర్మిస్తానని చెప్పి… టీడీపీని నిర్మించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏ పథకాలు పెట్టలేదని.. ఆయన అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని క్లెయిమ్ చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటూ.. పాత కథను మళ్లీ చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిన తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని బాధపడ్డారు. మళ్లీ గెలవలేమోననే ఆందోళనతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు.

మా పార్టీ సభను కార్యకర్తలు ఇచ్చిన డబ్బులతోనే సభను ఏర్పాటు చేశామని.. కానీ చంద్రబాబు ప్రజల డబ్బుతో ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి నన్ను తిట్టే ముందు ప్రజలకు ఖర్చులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదో ఇబ్బందితోనే తప్పించుకోవడానికి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తనదైన కోణంలో విశ్లేషించుకున్నారు. ఏపీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామమని.. ఏపీకి ఏమైనా ఇబ్బంది జరిగితే అది ఏపీ ప్రభుత్వం వల్లేనని తీర్పు చెప్పారు. కేంద్రంలో వివిధ శాఖల ద్వారా రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. పదేళ్లలో నెరవేర్చాల్సిన విభజన హామీలను నాలుగున్నరేళ్లలో నెరవేర్చామన్నారు. ప్యాకేజీకే కేంద్రం కట్టుబడి ఉంది. మేము కమిట్‌మెంట్‌తో ఉన్న ఉపయోగించుకోవడం చంద్రబాబుకి చేతకాలేదని తీర్మానించారు.

తనకు మాత్రమే..సాధ్యమైన నాటకీయమైన హావభావాలతో ప్రసంగాన్ని నడిపించారు. ఆయన భాష గుంటూరు ప్రజలకు తెలియదు… జీవీఎల్ తర్జుమా.. గ్రాంధీక భాషలో ఉంటుంది కాబట్టి.. అక్కడి జనం అంతా డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లుగా.. ప్రసంగాన్ని ఆస్వాదించారు. మోడీ హావభావాల్లో తేడా కనిపించినప్పుడు చప్పట్లు కొట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close