రామమందిరంపై ఆర్డినెన్స్ లేనట్లే..! మోడీకి ఆరెస్సెస్ మరింత దూరం..!

భారతీయ జనతా పార్టీని సిద్ధాంత పరంగా నడిపిస్తున్న ఆరెస్సెస్‌తో .. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు విబేధాలున్నాయనే ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా జరుగుతోంది. దానికి కారణం ప్రజల్లో మోడీ , షాలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు.. రామమందిర నిర్మాణ విషయం కూడా. ఈ విషయంలో నరేంద్రమోడీ ఉన్న పళంగా ఆర్డినెన్స్ జారీ చేసి రామమందిరాన్ని నిర్మించాలని ఆరెస్సెస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్‌తో అయోధ్య కేంద్రంగా.. ర్యాలీలు చేపడుతున్నారు. ఆర్డినెన్స్ వచ్చి తీరుతుందని.. కొంత మంతి ఆరెస్సెస్ అగ్రనేతలు ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ నరేంద్రమోడీ మాత్రం ఈ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన ఇంటర్యూలో… న్యాయప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆర్డినెన్స్ అని తేల్చిచెప్పారు.

ప్రస్తుతం.. అయోధ్య రామాలయ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. దానికి సంబంధించిన విచారణ అత్యవసరంగా జరపాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత .. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసి రామమందిరం నిర్మిస్తామన్న పద్దతిలో… మోడీ చెప్పుకొచ్చారు. మోడీ ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన వెంటనే.. ఆరెస్సెస్ వర్గాలు.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆరెస్సెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో.. మోడీ తన ఎన్నికల హామీలను..ఈ టర్మ్‌లోనే పూర్తి చేయాలని కోరుతున్నారని… ట్వీట్లు చేశారు. ఆరెస్సెస్ ఇతర ఎన్నికల హామీల గురించి మాట్లాడదు. రామమందిరం గురించే మాట్లాడుతుంది కాబట్టి.. మోడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే.. ఆర్డినెన్స్ తీసుకు రావాలని ఆరెస్సెస్ డిమాండ్ చేస్తున్నట్లయింది.

ఇటీవలి కాలంలో ఆరెస్సెస్.. మోడీకి ప్రత్యామ‌్నాయంగా గడ్కరీని ప్రొత్సహిస్తోందన్న నమ్మకం బీజేపీలో పెరగింది. ఆరెస్సెస్‌కు దత్తపుత్రునిగా పేరున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మోడీ, షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమికి బాధ్యత తీసుకోవడంపై క్లాసులు పీకుతున్నారు. అదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క మిత్రపక్షం కూడా మోడీని ప్రధానిగా అంగీకరించే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతూండటంతో.. మోడీకి బదులుగా నితిన్ గడ్కరీని ఇప్పటికే.. ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో పెట్టేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ లేదని చెప్పడం ద్వారా మోడీ.. ఆరెస్సెస్‌తో గ్యాప్ మరింత పెంచుకున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close