అవినీతిపై మోదీ మాటలు బాగు బాగు..! మరి చేతలు..!?

నిజమే.. చిన్న కుంభకోణాన్ని చేసినప్పుడు విస్మరిస్తే.. అది పెద్ద కుంభకోణాలు చేయడానికి దోహదం చేస్తుంది..! కొద్దిగా అవినీతికి అలవాటు పడిన వారిపై.. దొరికినా ఏమీ చర్యలు తీసుకోకపోతే.. వారు ధైర్యంగా మరింత అవినీతి చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా అదే చెబుతున్నారు. అవినీతి కేసుల్లో జాప్యం కుంభకోణాలకు పునాది అని చెబుతున్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే తరువాతి తరం మరింత రెచ్చిపోతుందని భవిష్యత్ గురించి కూడా ఆయన ఆందోళన చెందుతున్నారు. “నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్”లో కీలక ఉపన్యాసం చేసిన మోడీ .. అవినీతి కట్టడిపై అనర్ఘళమైన ప్రసంగం చేశారు. ఆయన మాటలు విని అందరూ చప్పట్లు కొట్టారు. నిజానికి ఆయన అభిప్రాయాలు కొత్తవి కావు చాలా కాలం నుంచి ఉన్నవే. ప్రధాని కాక ముందే.. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తానని.. ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాదిలోపు తేల్చేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం నరేంద్రమోడీ ప్రధాని పదవిని చేపట్టి.. ఏడేళ్లవుతోంది. మళ్లీ ఆ మాటను గుర్తు చేసుకోలేదు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను ఏడాదిలోపు తేల్చేయాలని కార్యాచరణ సిద్ధం చేసుకోగానే.. అవినీతి పరులు న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయవ్యవస్థపై భీకరంగా దాడి చేస్తున్నారు. విశ్వసనీయతను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా పేర్లను సైతం యథేచ్చగా ప్రచారంలోకి పెట్టేస్తున్నారు. మోడీ, అమిత్ షాలను కలిసిన తర్వాతే.. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ.. కొంత మంది లేఖ రాయడంతో.. వారి మద్దతుతోనే లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. అలా చెప్పడమే కాదు..వారికి సంబంధించిన ఓ న్యాయమూర్తి ఉన్నారని.. ఆయనను చీఫ్ జస్టిస్ చేయడానికే ఇలా చేస్తున్నారని పుకార్లు కూడా పుట్టించారు.

క్రిమినల్, అవినీతి పరమైన ఆలోచనలు ఉన్న వారి వ్యవహారశైలి ఎలా ఉంటుందో.. అందరికీ తెలుసు. అలాంటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి.. సమాచారాన్ని కులాలు, మతాల పరంగా విడగొట్టి.. రాజకీయ అధికారాన్ని సాధిస్తే.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్ల ముందు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తూ.. నరేందరమోడీ ఇప్పటి వరకూ… ఆ అవినీతి పరులకే అండగా నిలిచినట్లుగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసం.. భారీ కుంభకోణాలకు పాల్పడిన వారిని.. రాజకీయంగా ప్రొత్సహిస్తూ.. అండగా ఉంటున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. నరేంద్రమోడీ… “నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్”లో ప్రసంగం చాలా మందిని ఆకర్షించింది. ఆయన మాటల్లో పట్టుదల కనిపిస్తోందని కొంత మంది అంటే… ఆయన చాలా కాలంగా అలాంటి మాటలే చెబుతున్నారని కానీ చేతల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే చూస్తారని అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనుకుంటే.. అవినీతి పరుల్ని తరిమేయాలనుకుంటే.. అడ్డుకునేవారు లేరు. బీజేపీ కి రాజ్యసభ అవసరాల కోసమో… తన ప్రత్యర్థుల్ని ఎదుగకుండా చేయాలన్న లక్ష్యంతోనే అవినీతి పరులకు అండగా ఉండాలని అనుకుంటే.. ఆయన చెప్పినట్లుగా అది ఇంకా ఇంకా భారీ కుంభకోణాలకు దారి తీస్తుంది. అంతిమంగా దేశానికి నష్టం కలిగిస్తుంది. ఇప్పటి వరకూ మాటలే చెప్పారు.. ఇక నుంచి చేతల్లోనూ చూపించాల్సిన అవసరం.. ప్రధానికి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close