ఆంధ్రా బాట‌లోనే… తెలంగాణ‌లోనూ కొత్త మ‌ద్యం బ్రాండ్స్

ఏపీలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన వాటిలో మ‌ద్యం బ్రాండ్లు ఒక‌టి. గ‌తంలో ఎన్న‌డూ విన‌ని, చూడ‌ని పేర్ల‌తో కొత్త కొత్త మ‌ద్యం బ్రాండ్స్ క‌నిపించాయి. వీటిపై వ‌చ్చిన వార్త‌లు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఏపీ రాజ‌కీయాల్లో ఈ బ్రాండ్ల లొల్లి కూడా చాలా పెద్ద‌దే.

ఇప్పుడు ఇవే సీన్స్ తెలంగాణ‌లోనూ రిపీట్ అయ్యేలా క‌న‌ప‌డుతున్నాయి. మొన్న‌నే స్వ‌యంగా అబ్కారీ మంత్రి వ‌చ్చి కొత్త మ‌ద్యం బ్రాండ్లు తెలంగాణ‌లో రావు, ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు అని వివ‌రణ ఇచ్చారు. వారం కూడా గ‌డ‌వ లేదు మాకు తెలంగాణ‌లో మ‌ద్యం అమ్ముకునేందుకు అనుమ‌తి వ‌చ్చింద‌ని ఓ కంపెనీ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా చేసుకుంది.

హంట‌ర్, ప‌వ‌ర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పిక‌ర్ పేర్ల‌తో కొత్త బ్రాండ్ బీర్లు తెలంగాణ‌లోనూ అమ్మ‌బోతున్న‌ట్లు సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌క‌టించింది. కానీ ఇదంతా మంత్రికి తెలియ‌కుండానే జ‌రిగిందా అన్న అనుమానాలు వ‌స్తున్న ద‌శ‌లో బీఆర్ఎస్ మ‌రింత దూకుడు పెంచి ఆరోప‌ణ‌లు చేసింది.

కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల విరాళాలు ఇచ్చిన ఈ కంపెనీని క్విడ్ ప్రోకో లో భాగంగానే తెలంగాణ‌లో అనుమ‌తించార‌ని, గ‌తంలో ఈ కంపెనీ క‌ల్తీ మ‌ద్యం చేస్తుంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ బ్యాన్ చేసింద‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దిగ్విజ‌య్ సింగ్ కు ఈ కంపెనీతో సంబంధాలున్నాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. రానున్న రోజుల్లో గోల్డ్ మెడ‌ల్, ప్రెసిడెంట్ మెడ‌ల్ బ్రాండ్స్ కూడా అనుమ‌తిస్తారేమో అంటూ కామెంట్ చేసింది.

దీనికి అబ్కారీ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై !

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన 2014-19 వరకు ఐదేళ్ల పాటు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు పార్టీలోనే ఉన్నా...
video

మిస్టర్ బచ్చన్ షో రీల్: రైడ్ కి ఓ కొత్త లేయర్

https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak హరీష్ శంకర్ లో మంచి మాస్ టచ్ వుంది. ఆయన ఏ కథ చెప్పినా మాస్ అప్పీలింగ్ తో తయారు చేస్తుంటారు. రిమేకులు చేయడంలో కూడా ఆయనకి సెపరేట్ స్టయిల్ వుంది. దబాంగ్...

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close