టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది… `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా… టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు కావ‌డం రివాజు. ఈసారీ.. ఆ హంగామా క‌నిపించింది. ఒక రోజు ముందుగానే ర‌వితేజ `ఖిలాడీ` టీజ‌ర్ వ‌చ్చేసింది. అంతేకాదు.. ఈరోజే ర‌వితేజ కొత్త సినిమా ఒక‌టి.. ప‌ట్టాలెక్కింది. దాంతో పాటు.. కొన్ని చిన్న సినిమాలూ కొబ్బ‌రి కాయ కొట్టుకున్నాయి.

ఒక రోజు ముందు నుంచీ `ఉగాది` హ‌డావుడి ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ – కొర‌టాల కొత్త సినిమా అప్ డేట్ సోమ‌వార‌మే వ‌చ్చేసింది. ఉగాది రోజున‌.. బాల‌య్య `అఖండ‌` టైటిల్ ని ప్ర‌క‌టించారు. దాంతో పాటు ఓ టీజ‌రూ వ‌చ్చింది. ఈ ఉగాది బాల‌య్య ఫ్యాన్స్ కి అలా.. ప్ర‌త్యేకంగా మారిపోయింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి… కొత్త స్టిల్ ఒక‌టి విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ – చ‌ర‌ణ్‌ల‌ను ఊరి జ‌నం గాల్లోకి ఎత్తేసిన పోస్ట‌ర్ అది. `ఆచార్య‌` నుంచి కూడా ఓ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ కి జోడీ గా క‌నిపించ‌నున్న‌ పూజా హెగ్డే ఈ పోస్ట‌ర్ ద్వారా తొలిసారి ప‌ల‌క‌రించింది. ఈరోజు `ట‌క్ జ‌గ‌దీష్‌` ట్రైల‌ర్ రావాల్సింది. కానీ సినిమా వాయిదా ప‌డ‌డంతో… ట్రైల‌ర్ నీ ఆల‌స్యంగా తీసుకొస్తున్నారు. అయితే.. ట‌క్ జ‌గ‌దీష్ నుంచి ఉగాది సంద‌ర్భంగా ఓ కొత్త పోస్ట‌ర్ వ‌చ్చింది. ఇలా… తెలుగు సంవ‌త్స‌రాదిన కొత్త సినిమాల ముచ్చ‌ట్లు వ‌రుస క‌ట్టాయి. ఈ యేడాదంతా.. ఇలానే సంద‌డి సంద‌డిగా సాగాల‌న్న‌ది సినీ అభిమానుల ఆకాంక్ష‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close