నిహారిక కూడా మొద‌లెట్టింది

త‌మ సినిమా విడుద‌ల అవుతోందంటే ఫ్యాన్స్ ని పిలిచి మీటింగ్ పెట్ట‌డం.. మెగా హీరోల‌కు అల‌వాటే! మెగా ఇంటి నుంచి వ‌స్తున్న తొలి హీరోయిన్ నిహారిక కూడా ఈ ఆన‌వాయితీని కొన‌సాగించింది. నిహారిక క‌థానాయిక‌గా న‌టించిన ఒక మ‌న‌సు విడుద‌లైకు సిద్దమైంది. ఈ సంద‌ర్భంగా నిహారిక ఫ్యాన్స్ తో మీట్ అయ్యింది. వాళ్ల‌తో త‌న పాత్ర‌కు సంబంధించిన విశేషాలు పంచుకొంది. అంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా ఒక మ‌న‌సు సినిమా ఉంటోంద‌ని, తొలి సినిమాకే ఇలాంటి పాత్ర ద‌క్క‌డం త‌న అదృష్ఠ‌మ‌ని చెప్పుకొచ్చింది. ఇక ముందు కూడా మంచి సినిమాల్లోనే న‌టిస్తాన‌ని అభిమానుల‌కు మాటిచ్చింది.

నిహారిక మీటింగ్ భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని అనుకొన్నా.. స‌మ‌యాభావం వ‌ల్ల కుద‌ర్లేదు. వివిధ జిల్లాల‌నుంచి.. వంద‌లాది మ‌హిళా అభిమానుల్ని హైద‌రాబాద్ ర‌ప్పిద్దామ‌నుకొన్నారు. అయితే అంత‌గా ఆస‌క్తి క‌నబ‌ర‌చ‌క‌పోవ‌డంతో ప‌ట్టుమ‌ని 30 మంది కూడా ఈ మీటింగ్‌కి రాలేక‌పోయారు. దాంతో.. గ్రాండ్‌గా జ‌రుగుతుంద‌నుకొన్న ఈ మీటింగ్ కాస్త చ‌ప్ప‌గా సాగింది. మహిళా అభిమానుల‌కు మాత్ర‌మే పిలుపు రావ‌డం ప‌ట్ల‌.. మెగా ఫ్యాన్స్‌కాస్త కినుక వ‌హించార‌ని టాక్‌. అంద‌రినీ పిలిస్తే బాగుండేది క‌దా.. అని నిహారిక‌కు స‌న్నిహితులు ఇప్పుడు స‌ల‌హా ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close