రివ్యూ : ఓ కొత్త ప్రయత్నం విపలం ‘ఒక్క అమ్మాయి తప్ప’

ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా , కేవలం కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో, అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’ మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10 న విడుదల అయ్యింది. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో, ఓ ఫ్లై ఓవర్‌పై నడిచే కథ కావడంతో ’ఒక్క అమ్మాయి తప్ప’పై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకునేలానే ఉందా? చూద్దాం..

కథ :
హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసి ఫ్లై ఓవర్ ని బాంబులతో పేల్చివేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించి, ఓ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ అయిన అన్వర్ (రవికిషన్) ప్లాన్ చేస్తాడు. జైల్లో ఉన్న టెర్రరిస్ట్ అస్లాం (రాహుల్ దేవ్)ని వదిలితే సరి లేదా ఫ్లై ఓవర్ ని బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరిస్తాడు. ఇది ఇలా ఉండగా రమ్మీ ఆడటంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వచన్ (సందీప్ కిషన్) అనుకోకుండా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ లో మ్యాంగో (నిత్యామీనన్) ని కలుస్తాడు. ఆమె తన చిన్నప్పటి స్నేహితురాలు మ్యాంగో అని తెలుసుకుంటాడు. ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హీరోకి ఓ అగంతకుడి దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరోకి, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధం ఏంటి? టెర్రరిస్ట్ అస్లాం జైలు నుంచి విడుదల అయ్యాడా? అసలు చివరికి ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫామెన్స్ :
మంచి ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకున్న నిత్యామీనన్ మ్యాంగో పాత్రలో ఈ సినిమాకి ఓ హైలెట్ గా నిలిచింది. పాత్ర పరంగా గొప్పగా చెప్పుకోదగినతన కాకపోయినా తన నటనతో ఆకట్టుకుంది ని త్యామీనన్ . సందీప్ కిషన్ నటన ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సీరియస్ సన్నివేశాల్లో కూడా సందీప్ నటన ఆకట్టుకుంటుంది. ఆలీ పాత్రలో చేసిన కామెడీ ఏమాత్రం ఆకట్టుకో లేదు. రవి కిషన్ లౌడ్ యాక్టింగ్‍తో బాగా విసిగించాడు. రేవతి , అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి,పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్ తమదైన స్తాయిలో నటించారు.

సాంకేతిక వర్గం:
2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా కథను నమ్మను అంటూ నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ చాల ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆ విషయం నిజం అనిపించింది. ఓ వైవిధ్యమైన కథనే రాసుకుని స్నేహం, ప్రేమ, టెర్రరిజం చుట్టూ నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాడు. కథ సింపుల్ పాయింట్ కావడంతో స్క్రీన్ ప్లే చాలా తెలివిగా, ఆసక్తికలిగించే విధంగా రాసుకోవాల్సింది. ప్రధమార్థంలో విసిగించిన దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం ఫర్వాలేదనిపిస్తాడు. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం రచయితగా, దర్శకుడిగా రాజసింహ తన ప్రతిభ చూపాడు. సినిమాలో ప్రతి ఫ్రేం చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉండేలా సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ’ఎగిరెనే ఎగిరెనే…’ పాటలో వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా రాత్రి ఎఫెక్ట్ లో తీసిన సన్నివేశాలకు ఇచ్చిన లైటింగ్ బావుంది. గ్రాఫిక్స్ కొద్దిచోట్ల ఫరవాలేదనిపించినా అక్కడక్కడ తేలిపోయాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :
‘ఒక్క అమ్మాయి తప్ప’ టైటిల్ తప్పుదారిపట్టించేలా వుంది. కథకు టైటిల్ కి సంబంధం లేదు. స్నేహం, ప్రేమ, టెర్రరిజం ఇలా మూడు అంశాలను ఒక ఫార్ములా కథకు కలిపి చెప్పడం బాగా ఆకట్టుకునే అంశం. కాని ఫస్ట్ హాఫ్ అలా లేదు, ఇక సెకండాఫ్ లోనే అసలైన కథ మొదలవడంతో సినిమా ఆసక్తికలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచీ చివరి ముప్పయి నిముషాలు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. హీరో, హీరోయిన్ల చిన్నప్పటి లవ్ ట్రాక్ ఎటువంటి ఎమోషన్ కలిగించకపోవడంతో విసుగు కలిగిస్తుంది. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో పాటు సినిమాని అక్కడక్కడా సాగదీశారు. దర్శకుడు కొత్త థ్రిల్లర్ లైన్ అనుకున్నా, రెగ్యులర్ ఫార్ములా లాగా ప్రేమకథ చుట్టూనే ఎక్కువసేపు కథను నడపడం సినిమాకు మైనస్ పాయింట్. అలాగే కథాంశం బలమైనదే అయినా కోతదేమి కాదు, అంతేకాకుండా కథ విషయంలో ఎప్పుడూ కొత్తదనం కోరుకునేవారికి, రెగ్యులర్ కథలను పెద్దగా ఇష్టపడని వారికి కూడా ఈ కథలో తాము కోరుకునే అంశాలు తక్కువే. అంతేకాకుండా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం, ఉన్న కామెడీ కూడా పండకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది. ఇక ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ ని పూర్తిగా వదిలేసారు. చివరాఖరికి చెప్పేదేంటంటే…ఎటువంటి అంచనాలు లేకుండా, కొత్త ప్రయత్నమేదో చూద్దామనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5
బ్యానర్: అంజిరెడ్డి ప్రొడక్షన్స్
నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి తదితరులు.
సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు,
ఆర్ట్‌: చిన్నా,
సంగీతం: మిక్కి జె.మేయర్‌,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ ,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు,
సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి ,
నిర్మాత: బోగాది అంజిరెడ్డి,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ,
విడుదల తేది :10.06.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close