కార్తికేయ2 నిఖిల్ కి పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు అదే నమ్మకంతో తన కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా “స్వయంభు” చేస్తున్నాడు. భారత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ‘సెంగోల్’ చుట్టూ తిరిగే కథ ఇది. శివుడు శ్రీరాముడికి ప్రసాదించిన ‘సెంగోల్’ కోసం జరిగే భీకర యుద్ధాలు ఈ సినిమా కథాంశం. ధర్మం కోసం కత్తి పట్టిన వీరుడిగా పాత్రలో నిఖిల్ కనిపించాడు.
దర్శకుడు భారత్ కృష్ణమాచారి సెంగోల్ గాథ చూపించిన తీరు ఆకట్టుకునేలా వుంది. చరిత్ర, పురాణాలను కలిపి ఒక వార్ సినిమా నిర్మించడం ఆసక్తిని రేపింది. టీజర్లో వార్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిఖిల్ లో పాటు సంయుక్త, నభా నటేశ్ యుద్ధ భూమిలో కనిపించారు. టెక్నికల్‌గా సినిమా కాన్వాస్‌పై గట్టిగానే వుంది. విజువల్స్ లో సెంథిల్ కుమార్ పనితనం కనిపించింది. గ్రాఫిక్స్ లో క్యాలిటీ వుంది. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఆకర్షణ. సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసేలానే వుంది.
