సీఎం జిల్లాల టూర్ల ఖర్చులకూ చందాలే..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థి క్లిష్టంగా ఉందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది కానీ… ఎంత క్లిష్టం అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ.. అప్పుడప్పుడు బయటకు వచ్చే కొన్ని విషయాలతో మరీ ఇంత గడ్డు పరిస్థితా.. అని పోల్చుకోక తప్పదు. ఇలాంటి రెండు ఘటనలు ఇప్పుడు.. మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి.. గత వారం రోజుల పరిధిలో రెండు జిల్లాలకు వెళ్లారు. మొదటిది కర్నూలు జిల్లాలో కంటి వెలుగు పథకం మూడో దశ ప్రారంభానికి వెళ్లారు. రెండోది విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ా రెండు కార్యక్రమాలను.. అధికారులు ఘనంగానే నిర్వహించారు. కానీ.. ఇప్పుడు.. వాటికి అయిన ఖర్చులు .. ఎవరు భరించాలంటూ.. చర్చ ప్రారంభమయింది. అధికారులపై ఆ భారం మొత్తం పడటంతో.. మీడియాకు లీక్ చేశారు. వారు చెప్పిన విషయాలు మీడియా ప్రచురించడంతో.. ప్రభుత్వానికి మరీ ఇంత ఆర్థిక కష్టమా..? అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి.

విజయనగరం జిల్లాలో పథకం ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. మూడు గంటల కార్యక్రమంలో.. పాల్గొన్నారు. దాని కోసం అయిన ఖర్చును రెండు కోట్లుగా అధికారులు తేల్చారు. మామూలుగా సీఎం పర్యటనల కోసం ఖర్చు ప్రభుత్వం ముందుగా విడుదల చేస్తుంది.కానీ ఈ పర్యటనకు చేయలేదు. దాంతో అధికారులు.. ఏర్పాట్లు చేశారు. కాంట్రాక్టర్లకు నోటిమాటగా చెప్పి ఏర్పాట్లు చేయించారు. కార్యక్రమం అయిన తర్వాత ఆ కాంట్రాక్టర్లందరూ బిల్లులు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత చన్న కార్యక్రమానికి రెండు కోట్లు ఖర్చు పెట్టడం ఓ ఎత్తు అయితే.. అసలు ఆ ఖర్చు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం ఏమిటని.. జిల్లా అధికారుల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది.

విజయనగరం ఖర్చు గురించి బయటకు రాగానే.. కర్నూలులో జరిగిన టూర్ ఖర్చుల వ్యవహారం కూడా మీడియాలో హైలెట్ అవుతోంది. అక్కడి అధికారులు ప్రతి ప్రభుత్వ విభాగానికి ఇంత అని చందాలు వసూలు చేసి.. సీఎం టూర్ ఏర్పాట్లు చేశారన్న చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ మర్యాదలు.. సీఎంతో పాటు వచ్చే వారికి.. వసతి, భోజనాలు.. ఇలా ప్రతీ ఖర్చు వారిపై పడింది. దీంతో చందాలు వేసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ప్రభుత్వం.. ఎలాంటి నిధులు.. చివరికి ముఖ్యమంత్రి పర్యటన ఖర్చులు కూడా ఇవ్వకపోతూండటంతో.. అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఆర్థికంగా ఇంత గడ్డు పరిస్థితి ఉందని అనుకోవడం లేదని…వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close