తన కుటుంబంలో సినీ వారసత్వం ఏమవుతుందో ఇప్పటికిప్పుడు తనకి తెలియదని, అందుకోసం తానేమీ ప్లాన్ చేయలేదని అన్నారు ఎన్టీఆర్. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా తన తాజా ఎడిషన్‌ను ఎన్టీఆర్ కవర్ పేజీతో తీసుకొచ్చింది. ఈ ఫోటోషూట్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్యాషన్ వరల్డ్‌లోనూ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు.
ఈ మ్యాగజైన్‌తో మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ సినీ లెగసీ గురించి తెలిసిందే. ఈ మ్యాగజైన్ కవర్ స్టోరీలో సినీ వారసత్వ ప్రస్తావన కూడా వచ్చింది. దీనిపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు తారక్. “ఒక యాక్టర్‌గా నేను ఏది చేయడానికైనా సిద్ధమే. నా ఫ్యామిలీలో సినీ వారసత్వం ఏమవుతుందో ఇప్పటికిప్పుడు నాకు తెలియదు. అందుకోసం నేనేమీ ప్లాన్ చేయలేదు” అని తన మనసులో మాట చెప్పారు.
వార్ 2ని రిలీజ్‌కు రెడీ చేసిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ అధికారికంగా ఖరారు కాని ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.