బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో : ఎన్టీఆర్‌

మహానటి సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాలు తెలుగులో అరుదుగానే వస్తుంటాయి. ఇప్పుడు మహా నటి సినిమా విమర్శకులను, సామాన్య ప్రేక్షకుల నే కాకుండా, సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశంసల జల్లు అందుకుంటోంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై తన అభిప్రాయాలను , ప్రశంసలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ, బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో అంటూ కీర్తి సురేశ్‌ నటనను ప్రశంసించాడు.

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ – “మహానటి ఓ అనుభవం. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అలనాటి నటి సావిత్రి గారికి ఈ చిత్రం రూపంలో ఘన నివాళి ఇచ్చినందుకు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కి అభినందనలు. ఈ చిత్రానికి జీవం పోసినందుకు ప్రియాంక, స్వప్న, దత్‌ గారికి ధన్యవాదాలు. అద్భుతంగా నటించిన సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్ కి‌, అద్భుత సంగీతమందించిన మిక్కీ జే మేయర్‌ కి‌, చిత్ర యూనిట్‌ కి‌ శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేసారు.

మొత్తానికి “కీర్తి” సురేష్, పేరుకు తగ్గట్టు ఈ ఒక్క సినిమాతో, విపరీతమైన కీర్తి సంపాదించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close