రాజ‌మౌళి సినిమా… ఎన్టీఆర్ గ‌ప్ చుప్‌

‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’ ఇంట‌ర్వ్యూల కోసం ఈరోజు ప్రింట్ మీడియాముందుకొచ్చాడు ఎన్టీఆర్‌. సినిమా విష‌యాల‌తోపాటు, వ్య‌క్తిగ‌తమైన సంగ‌తుల్నీ పంచుకున్నాడు. అన్ని విష‌యాల‌పై మ‌న‌సు విప్పి మాట్లాడిన తార‌క్‌… రాజ‌మౌళి సినిమా గురించి అడిగేస‌రికి స‌మాధానం దాటేశాడు. ఎన్ని ప్ర‌శ్న‌లు సంధించినా, అటు తిప్పి ఇటు తిప్పి అడిగినా `రాజ‌మౌళి సినిమా గురించి మాత్రం అడ‌క్కండి..` అనే స‌మాధాన‌మే వినిపించాడు. ”రాజ‌మౌళి సినిమా గురించి ఏ విష‌య‌మైనా ఆయ‌న చెబితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా రాజ‌మౌళి మార్క్ చిత్రం” అనేశాడు తార‌క్‌. ”రామ్‌చ‌ర‌ణ్ తో క‌ల‌సి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇద్ద‌రం మంచి మిత్రులం. అన్నింటికంటే మించి ఈ సినిమాతో ఓ కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుడుతున్నాం. ఈ సినిమా ఎప్పుడు మొద‌లవుతుంద‌న్న‌ది రాజ‌మౌళినే చెప్పాలి” అన్నాడు ఎన్టీఆర్‌. మిగిలిన క‌థానాయ‌కుల‌తో మ‌ల్టీస్టార‌ర్ ఎప్పుడు? అని అడిగితే “అంద‌రితోనూ క‌ల‌సి ప‌నిచేయాల‌నివుంది. మేమంతా రెడీనే. అయితే… మా హీరోల్ని న‌డిపించ‌గ‌లిగే కెప్టెన్ దొర‌కాలి. రాజ‌మౌళి అందుకు స‌మ‌ర్థుడు కాబ‌ట్టే.. రామ్‌చ‌ర‌ణ్ సినిమా మొద‌ల‌వ్వ‌బోతోంది” అని చెప్పుకొచ్చాడు. వ‌ర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ బాగా పాపుల‌ర్ అయ్యింది. టైటిల్ కూడా ఇలానే ఉంటుందా? అని అడిగితే “అలా మాత్రం ఉండ‌దు. క‌థ‌కు ఏది అవ‌స‌ర‌మో అదే పెడ‌తారు” అని ముక్తాయించాడు ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close