సింహాద్రి సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మాస్ సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలే చేశాడు ఎన్టీఆర్. కానీ రాజమౌళి దర్శకత్వంలో చేసిన యమదొంగ సినిమాతో సహా ఏవీ కూడా సింహాద్రి స్థాయిని టచ్ చేయలేకపోయాయి. ‘అదుర్స్’లాంటి సినిమాలు హిట్ అయినా ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్‌కి పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు. ఇక రీసెంట్గా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టినప్పటికీ అవన్నీ కూడా కాస్త క్లాస్ టచ్‌తో ఉండే సినిమాలే. ఆ సినిమాలతో ఓవర్సీస్లో, క్లాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. కానీ తనకు స్టార్ ఢం తెచ్చిపెట్టిన మాస్ ఆడియన్స్‌లో ఎన్టీఆర్‌కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆ వర్గం ప్రేక్షకుల్లో ఉన్న గ్రిప్ పోకుండా ఉండేందుకే ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమాని మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్స్ అన్న కాన్సెప్ట్ ఒక్కటి చాలు… ఏ స్టార్ హీరో అభిమానులకైనా సూపర్ కిక్ ఇచ్చేస్తుంది. సినిమా అంతా కూడా మా హీరో తప్ప వేరే ఎవ్వరూ కనిపించకూడదు అని కోరుకునే హార్డ్ కోర్ అభిమానులకైతే పండగలాంటి వార్తే. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్, అదనంగా ఐటెం సాంగ్ భామ కూడా అంటే ఇక చెప్పేదేముంది. మాస్….ఊరమాస్ ఆడియెన్స్‌కి పిచ్చెత్తిపోవడం ఖాయం. అలాగే కామెడీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ని ప్రెజెంట్ చేయడంలో బాబీకి ఫుల్ కమాండ్ ఉంది. ‘పవర్’ సినిమాలో రవితేజలాంటి సీనియర్ హీరోనే యంగ్ లుక్‌లో సూపర్బ్ స్లైలిష్‌గా ప్రజెంట్ చేసిన బాబీ ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ని చాలా చాలా స్టైలిష్‌గా డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. జనతాగ్యారేజ్, నాన్నప్రేమతోలాంటి సినిమాల్లో కొన్ని సాంగ్స్‌లోనే డ్యాన్సులకు స్కోప్ ఉంటుంది. కానీ ఇలాంటి మాస్ మసాలా సినిమాలంటే ఇంట్రడక్షన్ సాంగ్ నుంచీ చివరి సాంగ్ వరకూ అన్నీ కూడా డ్యాన్స్ బేస్డ్ సాంగ్సే ఉంటాయనడంలో డౌటే లేదు. ఎన్టీఆర్ మార్క్ మాస్ డైలాగ్స్‌ని కూడా రైటర్ కమ్ డైరెక్టర్ అయిన బాబీ బాగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు. సో……ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మీటర్లో, ఫుల్ గ్లామర్ డోస్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడన్నమాట బాబీ. ఎన్టీఆర్ మాస్ అభిమానులకు మాత్రం ఈ సినిమా విందు భోజనంలా ఉంటుందని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. సర్దార్తో దెబ్బతిన్న… దెబ్బతినిపించిన బాబీ మరి ఇప్పుడు ఎన్టీఆర్ మాస్ హిట్ ఆశలను నెరవేరుస్తాడా?